Friday, November 1, 2024

TG | ప్ర‌జ‌ల దృష్టి మ‌ల్లించేందుకే ఆ పార్టీల పాద‌యాత్ర : బండి సంజయ్

రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ పక్కా ప్రణాళిక ప్రకారం పాదయాత్రలకు సిద్ధమవుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మానకొండూరు నియోజకవర్గం బెజ్జంకిలో ఆయన మీడియా మాట్లాదుతూ..

మూసీ ప్రక్షాళనకు వెచ్చించిన లక్షన్నర కోట్లతో ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరు హామీలను అమలు చేయకుండా రాహుల్ గాంధీ కోసం రేవంత్ రెడ్డి మూసీ ప్ర‌క్షాళ‌న‌ జపం చేస్తున్నారని విమర్శించారు. పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చే విధంగా.. నాడు కేసీఆర్ చేసినట్లుగానే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని విమర్శించారు. ఆరు గ్యారెంటీలపై సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసే దమ్ముందా అని సవాల్ చేశారు. ప్రధాని మోడీపై యుద్ధం చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ముందుగా అరు గ్యారంటీల అమలు చేయాలని డిమాండ్ చేశారు.

గతంలో త‌ను చేపట్టిన ప్రజా సంగ్రామ పాద‌యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్… ఇప్పుడు పాదయాత్ర చేయడం విడ్డూరమ‌న్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రావడం లేదని, బీఆర్‌ఎస్ పరిస్థితి నాయకుడు లేని ఓడలా ఉందని, కేటీఆర్ అహంకార వైఖరిని ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు.

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని, ఏ విషయంలోనూ బీఆర్‌ఎస్ అగ్రనేతలకు ఇప్ప‌టిదాకా కాంగ్రెస్ పార్టీ నోటీసులు ఇవ్వలేదన్నారు. దీపావళి ముందు బాంబులు పేలుతాయన్న మంత్రుల మాటల ప్రకారం బాంబులు పేలలేదు ఎద్దేవ చేశారు. ఏమన్నా అంటే కేంద్రం సహకరించడం లేదంటారని దుయ్యబట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement