దేశవ్యాప్తంగా సంచలనం స్సష్టించిన శ్రద్ధావాకర్ హత్య కేసు దర్యాప్తులో ముందడుగు పడింది. ఢిల్లీలోని మెహౌలీ అటవీ ప్రాంతం నుంచి స్వాధీనం చేసుకున్న ఎముకలు, వెంట్రుకలు శ్రద్ధావాకర్‌వేనని నిర్ధారణ అయింది. శ్రద్ధావాకర్ మతదేహాన్ని 35 ముక్కలు చేసి వేర్వేరు ప్రాంతాల్లో పారేయడం, అవి పూర్తిగా కుళ్లిపోయి ఎముకలు మాత్రమే లభ్యంకావడంతో ఆమె బాడీ పార్ట్స్ నుంచి శాంపిల్స్ సేకరించేందుకు పోలీసులకు వీలుకాలేదు.
దాంతో శ్రద్ధావాకర్‌విగా అనుమానించిన ఎముకలు, వెంట్రుకలను మైటోకాండ్రియల్ డీఎన్‌ఏ పరీక్షల కోసం హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ డయాగ్నస్టిక్‌కు పంపించారు. ఆ శాంపిల్స్‌లోని డీఎన్‌ఏ, శ్రద్ధా వాకర్ తల్లిదండ్రుల డీఎన్‌ఏతో సరిపోలింది. దాంతో ఈ కేసు దర్యాప్తు మరింత వేగవంతం అయ్యేందుకు అవకాశం దక్కింది.