భారత్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న గృహోపకరణాల మార్కెట్‌తోపాటు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఎయిర్ కండీషనర్ల మార్కెట్లోకి ప్రవేశించింది. యూరప్‌లో ప్రసిద్ధిచెందిన కన్య్సూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ థాంప్సన్.. కూల్ ప్రో మ్యాక్స్ సిరీస్‌లో నాలుగు మోడల్స్‌ను విడుదల చేసింది. థాంప్సన్ ఏసీలు ఇన్వర్టర్ విభాగాల్లో ఒక టన్ నుంచి 1.5 రకాల్లో లభ్యమవుతున్నాయి. ఈ ఏసీలను ఫ్లిప్‌కార్ట్ పై మార్చి 26నుంచి ప్రత్యేక పరిచయ ధర 26,490 రూపాయల్లో లభ్యం అవుతాయి. సూపర్ ప్లాస్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌పీపీఎల్) సీఈవో, థాంప్సన్ ఇండియా బ్రాండ్ లైసెన్సీ అవ్నీత్‌సింగ్ మార్వా మాట్లాడుతూ ఎయిర్‌కండీషనర్ల మార్కెట్‌పై చాలా ఆసక్తిగా ఉన్నామన్నారు. ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి థాంప్సన్ ఎయిర్‌కండీషనర్లును విడుదల చేశామన్నారు.
ఐదేళ్లలో రూ.500కోట్ల రూపాయల గృహోపకరణాల విభాగంలో పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. రాబోయే మూడేళ్లలో ఆన్‌లైన్ ఏసీ మార్కెట్‌లో 10శాతం వాటా పొందడాన్ని లక్ష్యంగా చేసుకున్నామన్నారు. ఈ సంవత్సరం మేకిన్ ఇండియా 30శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నామన్నారు. కాగా థాంప్సన్ కూల్ ప్రో మ్యాక్స్ ఏసీలలో 4ఇన్1 కన్వర్టబుల్, ట్రిపుల్ ఫిల్టర్, ఆటో రీస్టార్ట్, సెల్ఫ్ డయాగ్నోసిస్, స్లీప్‌మోడ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఈ ఏసీలపై ఒక సంవత్సరం వారెంటీ, కంప్రెసర్‌పై 10సంవత్సరాల వారెంటీ అందజేయనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..