Saturday, November 23, 2024

థామస్‌ ఉబెర్‌ కప్‌.. నిరాశపర్చిన పీవీ సింధు

థామస్‌ ఉబెర్‌ కప్‌ – 2022లో బుధవారం జరిగిన చివరి గ్రూప్‌ క్లాష్‌లో టీమిండియా మహిళల జట్టు పూర్తిగా విఫలమైంది. దక్షిణ కొరియాపై 5-0 తేడాతో పరాజయం పాలైంది. వరుసగా రెండు విజయాలను నమోదు చేసుకున్న తరువాత.. దక్షిణ కొరియాపై గ్రూప్‌ డి మ్యాచ్‌లో టీమిండియా ప్లేయర్లు పూర్తిగా నిరాశపర్చారు. ప్రపంచ నెంబర్‌ 7 క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధు కూడా ఓడిపోవడం కాస్త ఆందోళన కలిగించింది. వరుసగా రెండు సెట్స్‌లో పూర్తిగా ఆధిపత్యం చెలాయించిన దక్షిణ కొరియా ప్లేయర్‌ యాన్‌ సే యంగ్‌ పీవీ సింధును ఓడించింది. 42 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సింధు 15-21, 14-21 పాయింట్ల తేడాతో ఘోర ఓటమి నమోదు చేసుకుంది. ఇక రెండో మ్యాచ్‌లో మహిళల డబుల్స్‌ జోడీ శ్రుతి మిశ్రా, సిమ్రాన్‌ సింఘీ జోడీ టీమిండియా తరఫున తలపడగా.. 39 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో 13-21, 12-21 పాయింట్ల తేడాతో లీ సో హీ, షిన్‌ సెంగ్‌ చాన్‌ చేతిలో ఓడిపోయారు.

మూడో మ్యాచ్‌లో కిమ్‌ గా యున్‌తో 10-21, 10-21 పాయింట్ల తేడాతో ఆకర్షి కశ్యప్‌ పరాజయం పాలైంది. ఆ తరువాత 36 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో తనీషా క్రాస్టో, ట్రీసా జోలీ జోడీ 14-21, 11-21 పాయింట్ల తేడాతో కిమ్‌ హే జియాంగ్‌ కాంగ్‌, హీ యోంగ్‌ చేతిలో ఓడిపోయారు. ఇక చివరి పోరులో అష్మితా.. చలిహా సిమ్‌ యు జిన్‌తో తలపడింది. అష్మితా 18-21, 17-21 పాయింట్ల తేడాతో ముగించడంతో.. భారత్‌ వరుసగా 5 మ్యాచుల్లో ఓడి గ్రూప్‌ దశలో ఆఖరి మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన చేసింది. ఇంతకుముందు టీమిండియా కెనడా, అమెరికాలపై వరుసగా గెలిచిన భారత్‌.. దక్షిణ కొరియా చేతిలో పరాజయం పాలైంది. ఇక పురుషు జట్టు కూడా ఇప్పటికే ఉబెర్‌ కప్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది. నేడు క్వార్టర్‌ ఫైనల్లో టీమిండియా ఉమెన్స్‌ జట్టు థాయ్‌లాండ్‌తో తలపడనుంది. మరోవైపు మెన్స్‌ జట్టు నేడు మధ్యాహ్నం క్వార్టర్‌ ఫైనల్‌ ఆడుతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement