అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన దాడి ప్రపంచ దేశాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఎఫ్‌బీఐ.. ముమ్మరంగా దర్యాప్తు చేపట్టింది. ఈ కాల్పులు జరిపింది 20 ఏళ్ల కుర్రాడు అని ఎఫ్‌బీఐ తేల్చింది. అతడి పేరు థామస్ క్రూక్స్ అని వెల్లడించింది.
పెన్సిల్వేనియాలోని బెతెల్ పార్క్‌కు చెందిన 20 ఏళ్ల మాథ్యూ క్రూక్.. ట్రంప్‌పై దాడి చేసినట్లు ఎఫ్‌బీఐ అధికారులు గుర్తించారు. పెన్సిల్వేనియాలో ట్రంప్ ప్రసంగించడానికి ఏర్పాటు చేసిన స్టేజీకి 130 గజాల దూరం నుంచి మాథ్యూ క్రూక్ ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది.
ఇక ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని ఎఫ్‌బీఐ అధికారులు వెల్లడించారు. అయితే దానికి కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు. ఇక ట్రంప్‌పై కాల్పులకు సంబంధించిన ఏ సమాచారం ఉన్నా తమతో పంచుకోవాలని ర్యాలీకి హాజరైన వారికి ఎఫ్‌బీఐ విజ్ఞప్తి చేసింది.