శ్రీలంక ఆల్‌రౌండర్ తిసార పెరీరా అరుదైన రికార్డు సాధించాడు. ప్రొఫెషనల్ క్రికెట్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన తొలి శ్రీలంక క్రికెటర్‌గా నిలిచాడు. లిస్ట్-A క్రికెట్‌లో తిసార పెరీరా ఈ ఘనత సాధించడం విశేషం. ఎస్‌ఎల్‌సీ మేజర్ క్లబ్ టోర్నమెంట్‌లో భాగంగా ఆర్మీ స్పోర్ట్స్ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తిసార..పార్ట్ టైమ్ ఆఫ్ స్పిన్నర్ దిల్హాన్ కూరే బౌలింగ్‌లో సిక్సర్ల వర్షం కురిపించాడు. దీంతో అతడు 13 బంతుల్లోనే 52 పరుగులు సాధించాడు. లిస్ట్-A క్రికెట్‌లో ఇదే అత్యంత వేగమైన అర్థశతకం ఇదే. 2005లో శ్రీలంక ఆల్‌రౌండర్ కౌశల్య వీరరత్నె 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 2021లో వెస్టిండీస్ టీ20 కెప్టెన్ కీరన్ పొలార్డ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్ పెరీరానే కావడం గమనార్హం.
Advertisement
తాజా వార్తలు
Advertisement