Saturday, November 23, 2024

Kerala | ఇది ప్ర‌జ‌ల విజ‌యం : ప్రియాంక గాంధీ

కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ వయనాడ్‌లో భారీ విజయం సాధించారు. తన అభ్యర్థిపై ఏకంగా 4.04 లక్షలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలిచారు. వయనాడ్‌ నుంచి మొదటిసారిగా పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన ప్రియాంక గాంధీ ఇలా భారీ మెజార్టీతో గెలవడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ తన గెలుపుపై ఎక్స్‌ వేదికగా స్పందించారు. ప్రజలు తనపై చూపించిన విశ్వాసంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని ప్రజల విజయంగా అభివర్ణించారు.

పార్లమెంటులో మీ తరఫున తన గళాన్ని విప్పుతానని పేర్కొన్నారు. తన ప్రచారం కోసం పనిచేసిన యూడీఎఫ్‌లోని సహచరులు, కేరళలోని కాంగ్రెన్ నేతలు, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. తల్లి సోనియా గాంధీ, భర్త రాబర్డ్ వద్రా ఇచ్చిన సపోర్ట్‌ మర్చిపోలేనిదంటూ కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement