ఇవ్వాల చెపాక్‌లో స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మద్య క్వాలిఫయర్ మ్యాచ్ జరుగుతోంది. కాగా, ఈ సీజన్ లో జరిగే ప్లేఆఫ్ మ్యాచ్ లకి కాస్త ప్రత్యేకత ఉందని చెప్పవచ్చు. ఈరోజు జరుగుతున్న చెన్నై, గుజరాత్ మ్యాచ్ లో డాట్ బాల్స్‌కు ప్రత్యేక గ్రాఫిక్‌ను చూపిస్తున్నారు బ్రాడ్కాస్టర్లు.
దేశంలో పచ్చదనం నానాటికి తగ్గిపోతోంది. దీంతో బీసీసీఐ ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది. ఈ ప్లేఆఫ్ మ్యాచ్ లలో వేసిన ప్రతి డాట్ బాల్కి 500 చొప్పున మొక్కలను నాటాలని నిర్ణయించింది. అందుకే.. బ్రాడ్కాస్టర్లు ప్రతీ డాట్ బాల్స్ కు మొక్క గుర్తును చూపిస్తున్నారు.