Monday, November 11, 2024

IPL | ధోని, కోహ్లీకి ఈ మ్యాచ్ స్పెషల్.. రికార్డులు కొట్టొచ్చు

ఐపీఎల్ 2023లో క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న రోజు వచ్చేసింది. ఇవ్వాల (సోమవారం) బెండళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా బిగ్ ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు రెడీ అయిపోయారు కూడా. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఆసక్తికర పోరులో చెన్నై టీమ్ మొదట బ్యాటింగ్ కు దిగనుంది. కాగా, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ.. చిన్నస్వామి స్టేడియంలో ఆడే చివరి మ్యాచ్ ఇదే అనే వార్తతో ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. అయితే, ఈ మ్యాచ్ లో మరో రెండు పరుగులు చేస్తే ఆర్సీబీపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలుస్తాడు.

కాగా, ధోని ఇప్పటి వరకు ఆర్సీబీపై 31 ఇన్నింగ్సుల్లో 39.90 సగటు, 140 స్ట్రైక్‌ రేటుతో 838 పరుగులు చేశాడు. ఆర్సీబీపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో ప్రస్తుతానికి ధోని రెండో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో డేవిడ్ వార్నర్ (839 పరుగులు) ఉన్నాడు.

ఇక ధోనితో పాటు ఆర్సీబీ మాజీ సారథి విరాట్ కోహ్లీ కూడా ఒక అరుదైన రికార్డుకు దగ్గరయ్యాడు. అంతే కాకుండా ఈ సీజన్ లో కోహ్లీ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. ఇక కోహ్లీ చెన్నైపై 29 ఇన్నింగ్స్ ల్లో 979 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో కనుక కోహ్లీ 21 పరుగులు చేస్తే.. చెన్నైపై వెయ్యి పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ఇప్పటి వరకు ఈ చెన్నైపై వెయ్యి పరుగులు రికార్డ్ ని పూర్తి చేసిన బ్యాటర్ శిఖర్ ధావన్ మాత్రమే..

Advertisement

తాజా వార్తలు

Advertisement