మహిళల ఆసియాకప్ 2022 సీనియర్ టీమ్ ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ గౌరవ కార్యదర్శి జై షా మీడియా అడ్వయిజరీ జారీ చేశారు. బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నమెంట్. అక్టోబర్ 1న ప్రారంభమై 15న ముగుస్తుంది. ఈ కప్ కోసం ఆల్ ఇండియా మహిళా సెల క్ట్ చేసింది. జట్టులో హర్మన్ ప్రీత్ (కెప్టెన్) దీప్తి శర్మ, శఫాలీ వర్మ, జెనిమా రోడ్రిగ్స్, సబ్బినేని మేఘన, రిచా ఘోష్ (వికెట్ కీపర్, స్నేహ్ రానా, దయలన్ హేమలత, మేఘనసింగ్, రేనుకా థాకూర్, పూజ వస్తాకర్, రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్, కేపీ నవ్‌గిరే ఉన్నారు.
స్టాండ్ బై ప్లేయర్లుగా.. తనియా సప్న భాటియా, సిమ్రన్ దిల్ బహదూరున్ ఎంపిక చేశారు. అయితే ఆసియాకప్ షెడ్యూల్‌ను
టిట్టర్ వేదికగా జైషా ప్రకటించారు. మొదటి రోజు బంగ్లాదేశ్, థాయ్‌లాండ్‌తో తలపడనుంది. అదే రోజు భారత్, శ్రీలంకతో , అక్టోబర్ 7న పాకిస్తాన్ మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 11వ తేదీ వరకు లీగ్ స్టేజ్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. 13న సెమీ ఫైనల్, 15న ఫైనల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న 8వ ఎడిషన్ ఆసియాకప్‌లో ఏడు జట్లు పాల్గొంటున్నాయి. అందులో డిఫెండింగ్ చాంపియన్ బంగ్లాదేశ్‌తో పాటు ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్, థాయ్‌లాండ్, మలేసియా, యూఏఈ ఉన్నాయి. అయితే ఇండియా ఇప్పటివకు ఆరు ఆసియాకప్‌లు సొంతం చేసుకోవడం విశేషం.