Saturday, November 23, 2024

ప్రధాని మోడీ హైదరాబాద్‌ పర్యటన షెడ్యూల్‌ ఇదే..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : భారత ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. జులై 2వ తేదీ మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ చేరుకోనున్న ప్రధాని రెండు రోజులపాటు ఇక్కడ జరిగే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, 3వ తేదీ సాయంత్రం పరేడ్‌ మైదానంలో బహిరంగ సభలో పాల్గొంటారు. 4వ తేదీ ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ప్రధాని మోడీ పర్యటన వివరాలివి…

  • 2వ తేదీ (శనివారం) 12.45 నిమిషాలకు ఢిల్లి విమానాశ్రయం నుంచి బయలుదేరనున్న ప్రధాని. 2.55 గంటలకు బేగంపేట్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు.
  • 3 గంటలకు బేగంపేట్‌ విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా 3.20 గంటలకు హెచ్‌ఐసీసీ నోవాటెల్‌కు చేరుకుంటారు మోడీ.
  • 3.30 గంటలకు నోవాటెల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కి ప్రధాని.
  • 3.30 నుంచి 4 గంటల వరకు రిజర్వుడ్‌.
  • సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు బాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరు.
  • రాత్రి 9 గంటల నుంచి రిజర్వ్‌.
  • 3వ తేదీ (ఆదివారం) ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు బాజపా కార్యవర్గ సమావేశాల్లో పాల్గొననున్న ప్రధాని.
  • సాయంత్రం 4.30 నుంచి 5.40 గంటల వరకు రిజర్వ్‌.
  • సాయంత్రం 5.55 గంటలకు హెచ్‌ఐసీసీ హెలిప్యాడ్‌కి చేరుకోనున్న ప్రధాని.
  • సాయంత్రం 6.15 గంటలకు బేగంపేట్‌ ఎయిర్‌పోర్టుకు చేరిక.
  • 6.30 గంటలకు రోడ్డు మార్గాన పరేడ్‌ గ్రౌండ్‌ బహిరంగ సభకు మోడీ.
  • రాత్రి 6.30 నుంచి 7.30 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొననున్న మోడీ.
  • రాత్రి 7.35 నుంచి బహిరంగ సభ నుంచి బయలుదేరనున్న మోడీ.
  • ఆ రాత్రికి నోవాటెల్‌ లేదా రాజ్‌భవన్‌లో బస చేయనున్న ప్రధాని.
  • 4వ తేదీ (సోమవారం) ఉదయం 9.20 గంటలకు బేగంపేట్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న ప్రధాని.
  • బేగంపేట్‌ నుంచి విజయవాడకు ప్రత్యేక విమానంలో.
  • 10.10 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి రాక.
  • అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో భీమవరానికి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement