మంత్రి కేటీఆర్ ఈనెల 17న వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో జరిగే మంత్రి పర్యటన వివరాలను ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఇవ్వాల (బుధవారం) మీడియాకు తెలిపారు. ఉదయం 9.30 గంటలకు గీసుకొండ మండలం శాయంపేట గ్రామంలోని మెగా టెక్స్ టైల్ పార్క్ లో యంగ్ వన్ కంపెనీ పనులకు శంకుస్థాపన చేస్తారని, ఆ తర్వాత 11.30 గంటలకు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ప్రారంభిస్తారని నన్నపునేని వివరించారు..
మధ్యాహ్న అక్కడే భోజనం చేసిన తర్వాత ఆజంజాహి మిల్లు గ్రౌండ్ లో వరంగల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనానికి భూమి పూజ చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు దేశాయిపేటలోని జర్నలిస్టుల డబుల్ బెడ్రూం గృహాలను ప్రారంభిస్తారు. 2.30కి అక్కడే జిల్లా వర్కింగ్ వుమెన్ హాస్టల్ ను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి 2.50 గంటలకు కొత్తవాడ జంక్షన్ లో కొండా లక్ష్మణ్ బాపూజీ, చేనేతన్న విగ్రహాలను ఆవిష్కరిస్తారు. 3.15 గంటలకు మండిబజార్ లోఈద్గా, దర్గా, మసీదు పనులకు శంకుస్థాపన చేస్తారు.
3.40కి వరంగల్ చౌరస్తాలో స్మార్ట్ రోడ్లను ప్రారంభిస్తారు. 4.00 గంటలకు వరంగల్ మోడ్రన్ బస్ స్టేషన్ పనులకు, 4.30కు వరంగల్ ఆర్టీవో ఆఫీస్ జంక్షన్ లో ఇన్నర్ రింగ్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు. 4.50కి ఉర్సులో ఎస్టీపీని ప్రారంభిస్తారు. సాయంత్రం 5.00 గంటలరు ఉర్సు రంగలీలా మైదానం వద్ద చెరువు బండ్ ను ప్రారంభిస్తారు. కుడా ఆధ్వర్యంలో నిర్మాణం జరిగే కల్చరల్ సెంటర్ కు శంకుస్థాపన చేస్తారు.
అక్కడే నీటి సరఫరా అభివృద్ధి, పట్టణ ప్రగతి అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. 5.30 గంటలకు ఉర్సు దర్గాను సందర్శించి కుడా చేపట్టే అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. 6.00 గంటలకు ఖిలావరంగల్ ను సందర్శిస్తారు. అక్కడ ఫకాడ్ లైటింగ్ ను ప్రారంభిస్తారు. 6.30 గంటలకు ఓ సిటీలో జరిగే పార్టీ బహిరంగ సభలో పాల్గొంటారు.