న్యూజిలాండ్‌తో మిగిలిన రెండు టెస్టుల కోసం బీసీసీఐ ఆదివారం 16 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టులో స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు బీసీసీఐ అవకాశం కలిపించి అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే తొలి టెస్టులో భారత స్టార్ స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పూర్తిగా విఫలమయ్యాడు.
రెండు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 5 పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలో వాషింగ్టన్‌ను పిలిపించడంతో రెండో టెస్టులో జడేజా స్థానంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌లో సుందర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. తమిళనాడుకు ప్రాతినిథ్యం వహిస్తున్న వాషింగ్టన్ ఢిల్లితో జరుగుతున్న మ్యాచ్‌లో 152 పరుగులతో ఆకట్టుకున్నాడు. దీంతో అతడికి బీసీసీఐ నేరుగా కివీస్‌తో మిగిలిన టెస్టులకు ఎంపిక చేసింది.
కివీస్‌తో చివరి రెండు టెస్టులకు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), బుమ్రా, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురేల్ (వికెట్ కీపర్), అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, కుల్దిdప్ యాదవ్, సిరాజ్, ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్.