చైనాలో జరగనున్న ఆసియా క్రీడలకు భారత్ నుండి 19 మంది సభ్యులతో కూడిన బ్యాడ్మింటన్ జట్టు ఎంపికైంది. ఈ ఏడాది మేలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) నిర్వహించిన ట్రయల్స్ ఆధారంగా ఈ జట్టును నిర్ణయించారు. ఇక, చైనాలోని హాంగ్‌జౌలో జరగనున్న ఈ బ్యాడ్మింటన్ టోర్నీ అక్టోబర్ 28న ప్రారంభంకానుంది.
ఇక, ఈ పోటీల్లో మహిళల సింగిల్స్ జట్టుకి పీవీ సింధు సారథ్యం వహించనుండగా..పురుషుల సింగిల్స్‌లో దేశ అగ్రశ్రేణి ఆటగాడిగా హెచ్‌ఎస్ ప్రణయ్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు.
ఆసియా క్రీడల కోసం భారత జట్టు..
పురుషుల సింగిల్స్ – హెచ్‌ఎస్ ప్రణయ్, కిదాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్, మిథున్ మంజునాథ్.
మహిళల సింగిల్స్ – పివి సింధు, అష్మితా చలిహా, అనుపమ ఉపాధ్యాయ, మాళవిక బన్సోద్.
పురుషుల డబుల్స్ – సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి/చిరాగ్ శెట్టి, ధ్రువ్ కపిల/మిస్టర్ అర్జున్
మహిళల డబుల్స్ – ట్రీసా జాలీ/గాయత్రి గోపీచంద్ పుల్లెల, అశ్విని పొనప్ప/తనీషా క్రాస్టో
మిక్స్‌డ్ డబుల్స్ – సాయి ప్రతీక్/తనీషా క్రాస్టో