సినీ పరిశ్రమలో అతి పెద్ద సమస్య వయసని తెలిపింది హీరోయిన్ భాను శ్రీ మెహ్రా. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వయసు వచ్చినా స్త్రీలను.. పెళ్లైన మహిళలను కేవలం తల్లి, సోదరి, వదినా పాత్రలకే పరిమితం చేస్తారు. పురుషులకు వచ్చేసరికి అది వర్తించదు. వాళ్లు ఎప్పటిలాగానే ప్రధాన పాత్రలలో నటిస్తుంటారు. తమకంటే చిన్నవారికి ప్రేమికుడిగా కనిపిస్తారు. స్త్రీ విలువను వయసు లేదా ఆమె వైవాహిక స్థితి ఆధారంగా చేసుకుని ఎలా నిర్ణయిస్తారు . పాత పద్ధతికి ఇకనైనా స్వస్తి పలకండి. దైర్యవంతులు, స్వతంత్రంగా ఉన్న మహిళలకి కథలను చెప్పండి. అన్ని వయసుల మహిళలను పరిశ్రమ పోత్సహించాల్సిన సమంయ ఇది. దీనిని మీరూ అంగీకరిస్తారా అంటూ ప్రశ్నించింది. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్ వైరలవుతుండగా.. నెటిజన్స్ భిన్నరకాలుగా స్పందిస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement