Friday, November 22, 2024

అత్యుత్తమ పెళ్లి ఫోటో ఇదే!

పెళ్లంటే..తుళ్లింతే.. చేసుకునేవారికి.. చూసేవారికి కూడా ఓ సందడే. ఈ మధ్య కాలంలో కాస్తంత భిన్నంగా.. విభిన్నంగా.. తమ అభిరుచులకు తగ్గట్లు పెళ్లిళ్లు చేసుకోవడం అలవాటైంది. కొందరు సముద్ర అంతర్భాగంలోకి వెళ్లి పెళ్లి చేసుకుంటే..మరికొంరు వేలాది అడుగుల ఎత్తున.. పర్వత శిఖరాలపై ఒక్కటవుతున్నారు. ఇంకొందరు విమానంలో ప్రయాణిస్తూ మూడుముళ్లు వేసుకుంటున్నారు. ఒక్కొక్కరిది ఒక్కో ఇష్టం. సరే, పెళ్లిసందడిని ఆ తరువాత కూడా చూసుకుని మురిసిపోవాలని పోటోలు తీయించుకోవడం అందరికీ ఇష్టమే. కొందరు వృత్తికోసం ఫోటోలు తీస్తే మరికొందరు తృప్తి కోసం తీస్తారు. ఫోటోగ్రఫీ ఓ అద్భుతమైన కళ.. ఎటువంటి సందర్భంలోనైనా చక్కటి దృశ్యాలను కళ్లకు కట్టేలా ఫోటోలు తీయడంలో ప్రావీణ్యం కొందరికే ఉంటుంది. కొందరు ఇలాంటి సంబరాల్లో మంచి ఫోటోలు తీస్తే, మరికొందరు యుద్ధాలవంటి భయానక విపత్తుల్లోనూ ప్రాణాలకు తెగించి కెమేరా కంటితో వాస్తవాలను చూస్తారు. ఇదిగో.. అలాంటి నిపుణులైన ఫోటోగ్రాఫర్ల కోసం ఓ అంతర్జాతీయ పోటీ పెట్టారు. అందమైన, విభిన్నమైన పెళ్లిఫోటోల పోటీ అది. ఈ అంతర్జాతీయ పోటీలు 2017నుంచి ఏటా నిర్వహిస్తురన్నారు. ఫస్ట్ ప్రైజ్ వచ్చినవారికి 11వేల పౌండ్ల మొత్తాన్ని ఇస్తారు.

ఈ ఏడాది నిర్వహించిన ఇంటర్నేషనల్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అవార్డు కొట్టేసింది ఎవరో తెలుసా. టస్కనీకి చెందిన ఫేబియో మిరుల్లా. పెళ్లికూతురు ముస్తాబవుతుంటే.. ఆమె మేనికి ఓ మేకప్ ఆర్టిస్ట్ తుది మెరుగులు దిద్దుతోంది. ఈ దృశ్యాన్ని బ్లాక్ అండ్ వైట్ లో ఈ దృశ్యాన్ని ఫేబియో క్లిక్ మనిపించారు. ఆమె పూర్తిస్థాయిలో డ్రెస్ కాకపోవడంతో ఆమె ప్రైవసీని కాపాడుతూ తీసిన ఈ చిత్రానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సరే, ఇదేదో ఆషామాషా ఎంపిక కాదు సుమా.. ఏకంగా 58 దేశాలనుంచి 415మంది పోటోగ్రాఫర్లు పంపిన 4వేలకు పైగా ఫోటోల్లో ఎంపిక చేసిన తుది 1500 చిత్రాల్లో ఒకటి. ఇక కెనడాలోని రాతి పర్వతాలపై 11వేల అడుగుల ఎత్తున ఓ నూతన వధూవరుల జంట ఫోజును కెమేరాలో బంధించిన అండ్రూ ప్లవిలిడ్ రెండో బహుమతి సాధించారు. ఇదిగో మొదటి రెండు బహుమతులు పొందిన ఆ ఫోటోల గొప్పదనాన్ని మీరూ వీక్షించండి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement