Thursday, November 7, 2024

TG | దొరికిన దొంగలు ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు : మంత్రి పొన్నం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మందు పార్టీలో తాగి దొరికిన కేసులో సమర్థించుకోవడం, బుకాయిస్తే తప్పు ఒప్పయితదా ? కేటీఆర్‌ అని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఎద్దేవా చేశారు. జన్వాడలో కేటీఆర్‌ బామ్మార్తి రాజ్‌ పాకాల ఫాంహౌస్‌లో జరిగిన ఘటనలపై కేటీఆర్‌ తప్పేమి లేదన్నట్లుగా, మాదక ద్రవ్యాలు స్వీకరించడం మా జన్మహక్కనే విధంగా మాట్లాడారని మంత్రి కౌంటర్‌ ఇచ్చారు.

స్థానికుల ఫిర్యాదు మేరకే పోలీసులు ఫాంహౌస్‌పై దాడులు నిర్వహించారని. దొరికిన దొంగలు ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా కేటీఆర్‌ మాట్లాడడం సరికాదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడుల్లో పెద్దయెత్తున మద్యం దొరకడాన్ని సమర్థించుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రులు ప్రజాహిత కార్యక్రమాల్లో ఉన్నారని, ఎలాంటి కక్ష సాధింపులు ఉండవని కూడా పొన్నం స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై బీజేపీ స్టాండ్‌ ఏంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement