మరియపోల్‌లో సాధారణ పౌరుల తరలింపుపై ఒప్పందానికి విరుద్ధంగా రష్యా దాడులకు పాల్పడుతోందని ఉక్రెయిన్ ఆరోపించింది. మరియపోల్‌లోని స్టీల్‌ప్లాంట్‌వద్ద యుద్ధం తీవ్రస్థాయిలో జరుగుతోందని ఉక్రెయిన్ ప్రకటించింది. ప్రజల్ల భయాందోళనలు సృష్టించేందుకు పెద్దఎత్తున క్షిపణి దాడులకు పాల్పడుతూ రష్యా కొత్త రకం ఉగ్రవాదాన్ని అనుసరిస్తోందని ఉక్రెయిన్ ఆరోపించింది. ఈ మేరకు అటు అధ్యక్షుడు జెలెన్‌స్కీ, ఇటు ఆ దేశ మంత్రి దిమిత్రో కులేబా విమర్శలు గుప్పించారు. రాజధాని కీవ్ శివార్లలోని ఛెరెకసీ, ద్నిప్రో, జపోరిఝరి&ుయాలలో గురువారంనాడు రష్యా దాడులకు పాల్పడిందని ఉక్రెయిన్ సైనికాధికారులు ప్రకటించారు.
కాగా రష్యా పాల్పడుతున్న యుద్ధనేరాలన్నింటికీ చట్టపరంగా, రాజకీయంగా, యుద్ధక్షేత్రంలోనూ దీటైన జవాబిస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ హెచ్చరించారు. రెండో ప్రపంచ యుద్ధంలో విజయానికి చిహ్నంగా మే 9న రష్యా విజయోత్సవాలు నిర్వహించుకోనున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌పై దాడులు ముమ్మరం చేసింది. కాగా ఉక్రెయిన్‌లోని పశ్చిమ నగరమైన లెవివ్‌పై రష్యా దాడులకు పాల్పడిందని రోడ్డు, రైలు మార్గాలను ధ్వంసం చేసిందని అమెరికా ప్రకటించింది. పోలండ్ సరిహద్దుల్లో జరిగిన ఈ దాడులవల్ల నాటో దేశాలనుంచి ఆయుధ సరఫరాకు ఎటువంటి ఆంటంకం ఏర్పడదని బైడెన్ ప్రభుత్వం స్పష్టం చేసింది.