వంద రోజుల పాలనపై మోడీ వ్యాఖ్య
2047 నాటికి అగ్రపధంలో భారత్
సౌర, పవన, అణు, జల రంగాలపై దృష్టి
గాంధీనగర్: బీజేపీ100 రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలు కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందు ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గుజరాత్ గాంధీనగర్ లో నాల్గొవ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ అండ్ ఎక్స్ పో ను నేడు ఆయన ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్రమంత్రులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ… 2047నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నామన్నారు. అందుకు మన దగ్గర స్వంత చమురు, గ్యాస్ నిల్వలు లేవని కూడా మనకు తెలుసన్నారు.. దీనిని దృష్టిలో ఉంచుకుని సౌర, పవన, అణు, జల రంగాలపై పూర్తి దృష్టిని పెడుతున్నామన్నారు.
సోలార్ సిటీగా ఆయోధ్య ..
అయోధ్యతో పాటు మరో 16 నగరాలను మోడల్ సోలార్ సిటీగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అయోధ్య రాముడి జన్మస్థలంలో రాముడి గొప్ప ఆలయం నిర్మించామన్నారు.. అక్కడ మరికొన్ని రోజుల్లో సోలార్ సిటీ పనులు పూర్తి అవుతాయని తెలిపారు.