Tuesday, November 19, 2024

ప్రముఖుల విడాకులు….ధరలు ఎక్కువే !!

బిల్ గేట్స్ విడాకుల వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీంతో నెటిజెన్స్ అంతా కూడా గతంలో విడాకులు తీసుకున్న ప్రముఖుల వివరాలు గురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఈ నేపధ్యంలో నే గతంలో విడాకులు తీసుకున్న కాస్ట్లీ జంటల పేర్లు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా విడాకులు తీసుకున్న సమయంలో తమ భార్యలకు ఎంత భరణం ఇచ్చారో కూడా ట్రెండ్ అవుతుంది. ఆ జంటల వివరాలు చూసుకుంటే….

అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ 2019లో విడాకులు తీసుకుని తన భార్యకు రూ.2.80 లక్షల కోట్లు ఇచ్చారు.

2014లో దిమిత్రి రైబోలోలెవ్-ఎలీనా జంట విడిపోయింది. దిమిత్రి తన భార్య ఎలీనాకు 4.5 బిలియన్ డాలర్ల భరణం ఇచ్చారు.

అమెరికన్ వ్యాపారవేత్త ఎలిక్ 1999లో తన భార్యకు విడాకులు ఇచ్చారు. ఈ సందర్భంగా 3.8 బిలియన్ డాలర్ల భరణం చెల్లించారు

- Advertisement -

అమెరికన్ మీడియా దిగ్గజం మెఘల్ రూపెర్ట్ 1999లో తన భార్య నుంచి విడిపోతూ 2.6 బిలియన్ డాలర్ల భరణం ఇచ్చారు.

ప్రపంచంలోనే ఖరీదైన విడాకులు పొందిన ఐదో జంటగా బెర్నీ, స్లావికా జంట నిలిచింది. 2009లో విడిపోయిన ఈ జంట విడాకుల ఖరీదు 1.2 బిలియన్ డాలర్లు.

కాసినో మొఘల్ స్టీవ్ వీన్ తన భార్య నుంచి విడిపోయే క్రమంలో సుమారు బిలియన్ డాలర్లు చెల్లించారు.

ఇక ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ 1989లో తన భార్య ఎమీ నుంచి విడిపోయారు. అప్పట్లో వంద మిలియన్ డాలర్లను ఎమీకి భరణం ఇచ్చారాయన.

భర్త నుంచి విడాకులు పొంది ఆసియాలోనే సంపన్న మహిళల్లో ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు చైనాకు చెందిన యువాన్ లిపింగ్. షెంజన్ కాంగ్ టాయ్ బయోలాజికల్ ప్రోడక్ట్స్ కో చైర్మన్ డూ వీమిన్ భార్య ఈమె. లిపింగ్ కు విడాకులు ఇచ్చే సమయంలో 163.3 మిలియన్ షేర్లు బదలాయించారు వీమిన్. 2020 జూన్ లో మార్కెట్లు ముగిసే నాటికి యువాన్ ఆస్తి 3.2 బిలియన్ డాలర్లకు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement