Saturday, November 23, 2024

TS | అందరం ఏకమై ఈ ప్రభుత్వం మెడలు వంచాలి..

బస్‌యాత్రలో భాగంగా కేసీఆర్‌ మూడోరోజు మహబూబ్‌నగర్‌లో పర్యటించారు. క్లాక్‌టవర్‌ వద్ద జరిగిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ గవర్నమెంట్‌ వచ్చి ఐదునెలు అవుతొంది. మాకు ఓటు వేస్తే మొత్తం క్షణాలమీద చేస్తమని చెప్పారు. మరి రైతుబంధు అందరికీ వచ్చిందా..? రూ.15వేలు ఇస్తామన్నడు ఇచ్చారా..? రూ.2లక్షల రుణమాఫీ అయ్యిందా? అని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అని ప్రశ్నించారు.

వడ్లకు బోనస్ అన్నిరు.. ఆడపిల్లలకు స్కూటర్లు కొని ఇస్తం అన్నరు.. కల్యాణలక్ష్మి తులం బంగారం కలిపి ఇస్తా అన్నడు. మహిళలకు రూ.2500… ఆసరా పెన్షన్‌ రూ.4వేలు.. ఇట్ల ఎన్ని హీమీలు ఇచ్చిండు ఒక్కటైనా చేసిండా అటూ కేసీఆర్ ప్రశ్నించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ స్కీమ్‌ ఇస్తలేరు. మనం రూ.20లక్షల అంబేద్కర్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌ పెట్టినం. ఐదునెలల నుంచి బంద్‌ పెట్టారు. ఈ విధంగా ప్రతి విషయంలో మోసం. ప్రతీ స్కీమ్‌లో ధగా.. అన్ని రకాలుగా నాశనం చేస్తున్నరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నా కండ్ల ముందటనే.. తెలంగాణను ఇలా నాశనం చేస్తామంటే కేసీఆర్‌ యుద్ధం చేస్తడు తప్ప నిద్రపోడు. ఆనాడు అంత కష్టపడి.. ప్రాణాలకు తెగించి.. చచ్చిపోయినా ఫర్వాలేదని ఆమరణ నిరాహార దీక్ష చేసి మీ అందరి తోడు తెలంగాణ తెచ్చిన. తెలంగాణ నా కండ్ల ముందటే నాశనమైపోతే చూస్తూ ఊరుకోవాల్నా? ఎలాంటి పోరాటికైనా అందరూ తయారుగా ఉండాలి’ అని కోరారు.

ఈ ముఖ్యమంత్రిని హామీలు అమలు అమలు చేస్తలేవు అని ప్రశ్నిస్తే.. కేసీఆర్‌ గుండ్లుపీకి గోళీలు ఆడుకుంట.. కేసీఆర్‌ నీ పేగులు తీసి మెడలో వేసుకుంట.. నీ ముడ్డిమీదున్న చెడ్డిగుంజుకుంట.. నిన్ను చర్లపల్లి జైలులో వేస్తా అంటున్నడు. ఇది మర్యాదనా?’ అంటూ ప్రశ్నించారు. పది సంవత్సరాల పాలన ఎట్లా ఉండే ? కరెంటు ఎట్ల ఉండే? ఇవాళ వస్తుందా? మరి ఏం దుర్మార్గం ఇది. చేతనైత లేదా?… ఒక పార్టీయేమో దేవుడి పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతది. ఇంకో పార్టీ దేవుడిపై ఒట్లుపెట్టి ఓట్లు అడుగుతుంది. ఈ ఓట్ల రాజకీయాలను నమ్ముతరా ఎవడైనా? అని అన్నారు.

ఈ రెండు జాతీయ పార్టీలు ఏకమై ప్రాంతీయ పార్టీ బీఆర్‌ఎస్‌ను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతుందని కేసీఆర్‌ మండిపడ్డారు. ‘ఇవాళ బీజేపోడు వస్తడు. రేపు కాంగ్రెసోడు వస్తడు. బీఆర్‌ఎస్‌కు బీజేపీ బీ-టీమ్‌ అంటడు. వాడువీనికి.. వీనికి వాడు అంటడు. ఈ రెండు పార్టీలు ఏకమై ప్రాంతీయ పార్టీని దెబ్బతీసి ఇక్కడ ప్రాబల్యం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నరు. రాబోయే రోజుల్లో రైతాంగం, మన యువత అందరం ఏకమై కులమతాలకు అతీతంగా ఈ ప్రభుత్వం మెడలు వంచాలి. మెడలు వంచాలంటే బీఆర్‌ఎస్‌కు బలం కావాలి. బీఆర్‌ఎస్‌కు మీరిచ్చేదే బలం. ఇక్కడ శ్రీనివాస్‌రెడ్డి గెలిస్తే మహబూబ్‌నగర్‌ బీఆర్‌ఎస్‌కు బలం వస్తుంది. బీఆర్‌ఎస్‌కు మీరిచ్చే శక్తి.. మీకే ఉపయోగపడుతుంది అని అన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement