టెక్ మహీంద్ర ముంబైకి చెందిన ప్రముఖ టెక్ కంపెనీ థర్డ్‌వేర్ సొల్యూషన్స్‌ను టేకోవర్ చేయనుంది. థర్డ్‌వేర్‌కు చెందిన వందశాతం స్టేక్స్‌ను కొనుగోలు చేయనుంది. ఈక్రమంలో 42మిలియన్ డాలర్లను ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయనుంది. ఈ మేరకు టెక్ మహీంద్ర బోర్డు ఆఫ్ డైరెక్టర్స్..సంబంధిత ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. కాగా ముంబైకి చెందిన ఐటీ సర్వీసెస్ కంపెనీ థర్డ్‌వేర్ సొల్యూషన్స్‌ను 1995లో ఏర్పాటు చేశారు. 850మందికిపైగా ఉద్యోగులు ఈ కంపెనీలో పనిచేస్తున్నారు. ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్, ఎంటర్‌ప్రైజ్ పెర్‌ఫార్మెన్స్ మేనేజ్‌మెంట్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్, సహ సాఫ్ట్‌వేర్ కంపెనీలకు బిజినెస్ అప్లికేషన్స్, కన్సల్టింగ్, ఇంప్లిమెంటేషన్ అండ్ సపోర్ట్ సేవలను అందిస్తోంది.
ఎర్న్ అవుట్స్‌తో కలిపి ఈ కంపెనీనీ వందశాతం టేకోవర్ చేయాలని టెక్ మహీంద్ర నిర్ణయించింది. ఈ ఏడాది మే 31వ తేదీనాటికి టేకోవర్‌కు సంబంధించిన ప్రక్రియ పూర్తవుతుందని టెక్ మహీంద్ర తెలిపింది. గతే మూడేళ్లుగా థర్డ్‌వేర్ సొల్యూషన్స్ కంపెనీ నిలకడగా లాభాలను నమోదు చేస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో థర్డ్‌వేర్ సొల్యూషన్స్ 210.62కోట్ల రూపాయల టర్నోవర్‌ను సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి 31వ తేదీ నాటికి 226.5కోట్ల రూపాయల టర్నోవర్‌ను అందుకుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..