Home ముఖ్యాంశాలు Third Time – మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రిగా దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ ప్ర‌మాణం స్వీకారం ..

Third Time – మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రిగా దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ ప్ర‌మాణం స్వీకారం ..

0
Third Time –  మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రిగా దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ ప్ర‌మాణం స్వీకారం ..

ముంబ‌యి – మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ బాధ్యతలను అందుకోవడం ఆయనకు ఇది మూడోసారి. తొలి విడతలో పూర్తికాలం పాటు ముఖ్యమంత్రిగా పని చేశారు. రెండో విడతలో అయిదు రోజులు మాత్రమే ఈ హోదాలో కొనసాగారు.

ఇప్పుడు మూడోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించారు. మహాయుటి కూటమి నేతలు ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. ముంబై ఆజాద్ మైదాన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్ (ఉత్తరప్రదేశ్), భజన్ లాల్ శర్మ (రాజస్థాన్), మోహన్ యాదవ్ (మధ్యప్రదేశ్), విష్ణు దేవ్ సాయ్ (ఛత్తీస్‌గఢ్), ప్రమోద్ సావంత్ (గోవా), హిమంత బిశ్వ శర్మ (అస్సాం), మోహన్ చరణ్ మాఝీ (ఒడిశా), భూపేంద్ర పటేల్ (గుజరాత్), చంద్రబాబు నాయుడు (ఏపీ), నితీష్ కుమార్ (బిహార్), పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు.

Exit mobile version