భారత్- ఆస్ట్రేలియా మద్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో… ఆసీస్‌పై వరుసగా రెండు టీ20ల్లో గెలిచి 2–0 ఆధిక్యంలో ఉంది టీమిండియా. భారత్ తొలి మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో గెలుపొందగా.. రెండో మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక, రేపు ఆస్సామ్ వేదికగా జరగనున్న మూడో మ్యాచ్‌లోనూ విజయం సాధించి హ్యాట్రిక్ విన్‌తో సిరీస్‌ని దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. అయితే, రేపటి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉంచుకోవాలని కంగారూలు ఆశిస్తున్నారు.
తుది జట్లు ఇలా.. (అంచనా)
భారత్: రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్టోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ముఖేష్ కుమార్.
ఆస్ట్రేలియా: మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, జోస్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, టిమ్ డేవిడ్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్, కెప్టెన్), ఆరోన్ హార్డీ, సీన్ అబాట్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, ఆడమ్ జంపా.