ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్ ఖాతాలో మూడో స్వర్ణం చేరింది. పురుషుల 81కేజీల విభాగంలో భారత వెయిట్‌లిఫ్టర్ అజయ్‌సింగ్ స్వర్ణంతో మెరిశాడు. ఫైనల్లో అజయ్‌సింగ్ మొత్తం 322కేజీల బరువెత్తి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈక్రమంలో స్నాచ్‌లో 147కేజీలతో జాతీయ రికార్డు నెలకొల్పాడు. స్వర్ణ పతక విజేతగా నిలవడంతో అజయ్‌సింగ్ 2022 బర్మ్‌ంగ్‌హామ్‌లో జరిగే కామన్వెల్త్ క్రీడలకు నేరుగా అర్హత సాధించాడు.
కామ్‌న్‌వెల్త్ గేమ్స్‌కు నేరుగా అర్హత సాధించిన మూడో భారత వెయిట్‌లిఫ్టర్‌గా అజయ్ నిలిచాడు. అన్ని విభాగాల్లో స్వర్ణపతక విజేతలుగా నిలిచినవారికి నేరుగా సీడబ్ల్యూజీ 2022కు అర్హత లభిస్తుంది. ఇప్పటికే 67కిలోల విభాగంలో జెరేమీ, 73కేజీల విభాగంలో అచింత షియులీ బర్మింగ్‌హామ్ క్రీడలకు అర్హత సాధించారు. తాజాగా అజయ్‌సింగ్ వీరి సరసన చేరాడు. మిగిలిన లిఫ్టర్లు వారి ర్యాంకుల ఆధారంగా అర్హత సాధిస్తారు. కాగా మహిళల 59కేజీల కేటగిరిలో పాపీ హజరికా మొత్తం189కేజీల బరువెత్తి రజత పతకాన్ని సొంతం చేసుకుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital