కేవలం 12నిమిషాల్లో ఏటీఎంను దోచుకెళ్లారు దొంగలు. ఈ సంఘటన రాజస్థాన్ లోని బర్మార్ లో చోటు చేసుకుంది.మాస్క్ ధరించి బొలెరో వాహనంలో వచ్చిన ఐదుగురు దుండగులు రూ .38 లక్షల నగదు ఉన్న ఏటీఎంను చోరీ చేసి అదే వాహనంలోకి ఎక్కి పరారయ్యారు. నిత్యం రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగడం గమనార్హం. సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాస్క్‌లు ధరించిన ఐదుగురు వ్యక్తులు బొలెరో వాహనంలో వచ్చి ఏటీఎం షట్టర్‌ను బద్దలుకొట్టారు. సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేసిన దుండగులు చైన్‌ను ఉపయోగించి ఏటీఎంను తొలగించి తమ వాహనంలో ఎక్కించుకుని పరారయ్యారు. కేవలం 12 నిమిషాల్లోనే చోరీ తతంగాన్ని వారు ముగించారు. బుధవారం ఈ చోరీ జరిగిందని ముందుగా సెక్యూరిటీ గార్డు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు.ఘటనా స్ధలానికి చేరుకున్న నగనా పోలీసులు దుండగులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ప్రాధమిక దర్యాప్తులో ఐదుగురు వ్యక్తులు ఏటీఎం చోరీ ఘటనలో పాల్గొన్నారని గుర్తించారు. నేరానికి పాల్పడే ముందు నిందితులు ఘటనా స్ధలంలో రెక్కీ నిర్వహించారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement