Thursday, November 21, 2024

దొంగ అరెస్ట్ – న‌గలు స్వాధీనం – ఎస్ పి ఫక్కీరప్ప

అనంతపురం, ప్రభ న్యూస్ బ్యూరో : జిల్లా కేంద్రంలోని రజాక్ ఫంక్షన్ హాల్ వెనుక వైపున ఉన్న ఓ ఇంట్లో వృద్ధ మహిళను ఇటీవల కొడవలితో బెదిరించి ఆమె మెడలో ధరించిన బంగారు గొలుసు లాక్కెళ్లిన కేసు సహా.. 8 దొంగతనాలు, రాబరీ కేసులను అనంతపురం రూరల్ పోలీసులు ఛేదించారు. తీగలాగితే డొంక కదిలిన చందంగా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఒకరిని అరెస్టు చేశారు. అతని వ‌ద్ద‌ నుండి 38.23 తులాల బంగారు ఆభరణాలు, 2 టి.వి లు, పల్సర్ బైకులను స్వాధీనం చేసుకున్నారు. ( వీటి మొత్తం విలువ రూ. 20 లక్షలు ఉంటుంది) చెడు వ్యసనాల కోసం చేసిన అప్పులు తీర్చుకునే క్రమంలో చోరీలకు ఇప్పుడిప్పుడే అలవాటు పడి గత 50 రోజులలో 8 దొంగతనాలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుని శీఘ్రగతిన ఈ కేసులకు అనంతపురం సబ్ డివిజన్ పోలీసులు పరిష్కారం చూపారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి వెల్లడించారు. షేక్ ఖాజా పీరా, వయస్సు 28 సం., కేతిరెడ్డి కాలనీ, ధర్మవరం పట్టణం. అయితే ప్రస్తుతం ఇతను స్థానిక గుత్తి రోడ్డు, బాగ్యనగర్ లో నివాసముంటున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement