దొంగతానాకి వెళ్లిన ఎవరైన..ఎన్ని అడ్డంకులు ఎదురైన అనుకున్నది దోచుకొని బయటపడుతారు. మధ్యలో ఎవరైన అడ్డు వస్తే కత్తి చూపించి బెదిరిస్తారు. అవసరమయితే చంపడానికి కూడా వెనకాడరు. దొరికిన సొమ్మును ఎత్తుకుపోయే ముందు వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్తారు. కానీ, ఈ దొంగలు మాత్రం దానికి విరుద్దంగా చేశారు. బెదిరించి దొచుకున్న డబ్బు, బంగారంతో తిరిగి వెళ్తూ ఆ ఇంటి యజమాని కాళ్లకు మొక్కారట. అంతేకాదు, తీసుకున్న డబ్బులను ఆరునెలల లోగా తిరిగి ఇస్తామని చెప్పి వెళ్లారట. వెళ్తూ వెళ్తూ రూ.500 ఆ ఇంటి యజమానికి ఇచ్చి వెళ్లారట. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగింది. ఘజియాబాద్‌లోని రాజ్‌నగర్ లో నివశిస్తున్న సురేంద్రవర్మ ఇంట్లో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆ దొంగలు అలా ఎందుకు చేశారన్నది ఇప్పుడు ఓ మిస్టరీగా మారింది.
ఇది కూడా చదవండి: సరదాకి డీఎన్ఏ టెస్టు చేయించిన తండ్రి..విషయం తెలిసి షాక్