టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. గయానా వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో డిపెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఇంగ్లండ్ ముందు 172 పరుగుల టార్గెట్ సెట్ చేసింది. అనంతరం చేజింగ్ కు దిగిన ఇంగ్లండ్ పై భారత్ బౌలర్లు విరుచుపడ్డారు.
ఈ క్రమంలో మొత్తంగా ఇండియా జట్టు ఇంగ్లండ్‌ని 103 పరుగులకు ఆలౌట్ చేసింది. ఇక.. 68 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసుకుని అలవోకగా ఫైనల్స్‌కి దూసుకెళ్లింది. దీంతో ఇండియా అభిమానులు సంబురాలు చేసుకున్నారు.
మ్యాచ్ ప్రారంభంలోనే పలుమార్లు వర్షం ఆటంకం కలిగించింది. ఒక దశలో మ్యాచ్ రద్దు అవుతుందేమో అనే అనుమానం క్రికెట్ అభిమానుల్లో కలిగింది. కాగా, రెండు సార్లు అంతరాయం తర్వాత మళ్లీ మ్యాచ్ ప్రారంభం కాగా, 9 బాల్స్ ఆడిన కోహ్లీ తొమ్మిది పరుగులు మాత్రమే చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఒకింత అభిమానులు నిరాశకు గురయ్యారు.
ఆ తర్వాత వచ్చిన రిశబ్ పంత్ (4) కూడా తక్కువ స్కోరుకే అవుటయ్యాడు. అయితే స్లో పిచ్ అయినప్పటికీ కెప్టెన్ రోహిత్ శర్మ (57), సూర్య కుమార్ యాదవ్ (47) స్కోరు బోర్డుని మెల్ల మెల్లగా పరుగులు పెట్టించారు. వీరిద్దరి భాగ్యస్వామ్యంలో స్కోరు బోర్డు వంద పరుగుల మార్క్‌ని దాటేసింది. అదే క్రమంలో హిట్ మ్యాన్ రోహిత్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో రోహిత్ 57 పరుగుల వద్ద అవుటయ్యాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా(23), జడేజా (17), అక్షర్ పటేల్ (10) పర్వాలేదు అనిపించారు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులు చేసింది.
ఇక.. చేజింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టుకు మొదటి నుంచి కష్టాలే ఎదురయ్యాయి. భారత స్పిన్ బౌలర్ల దెబ్బకు వరుసగా వికెట్లు కోల్పోయి పెవిలియన్ దారిపట్టారు. ఒక దశలో 60 పరుగుల స్కోరు కూడా దాటుతారో లేదా అన్న అనుమానం కలగింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో కేవలం ఇద్దరు ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. అందులో అర్చర్ (21) ఆ తర్వాత జోస్ బట్లర్ (23), లివింగ్ స్టోన్ (11), బ్రూక్ (25)