Monday, November 25, 2024

జోరుగా చెరుకు రసం విక్రయాలు.. రహదారుల పక్కన చెక్కతో చేసిన బండ్లు..

ఘట్‌కేసర్‌, (ప్రభ న్యూస్‌) : ఎండలు మండి పోతుండటంతో జనాలు చల్లదనాన్నిచ్చే పానీయాల వైపు పరుగులు తీస్తున్నారు. చల్లదనంతో పాటు ఆరోగ్యాలను కాపాడుకో వాలనే ఉద్ధేశ్యంతో చెరుకు రసాలు తాగుతున్నారు. ఘట్‌కేసర్‌ మండలంలోని హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారి, ఘట్‌కేసర్‍-కుశాయిగూడ, ఘట్‌కేసర్‌-కీసర రోడ్ల పక్కన చెరుకురసం బండ్లు వెలిశాయి. అటు నగరం వైపు ఇటు ఘట్‌కేసర్‌ వైపు ప్రయాణించే ప్రజలు చెరుకు రసం తాగే విధంగా రహదారులకు ఇరువైపులా చెరుకుబండ్లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు చల్లదనాన్ని ఇచ్చే చెరుకు రసాలను విక్రయిస్తున్నారు. గతంలో యంత్రాల ద్వారా చెరుకురసంను తీసేవారు. ఈయంత్రాలు విధ్యుత్‌, డిజిల్‌ యంత్రాలతో నడిచేవి. విధ్యుత్‌తో నడిచే యంత్రాలు కరెంటు పోయిందంటే వచ్చిన గిరాకీని పోగొట్టుకోవాల్సిందే. కాని ప్రస్తుతం అలాంటి ఇబ్బంది లేకుండా చెక్కతో తయ్యారు చేసిన చెరుకు బండ్లను కొనుగోలు చేసి చెరుకు రసాలను విక్రయిస్తున్నారు. ఒక వ్యక్తి బండిలో చెరుకుగడలను పెడుతుండాలి, మరో వ్యక్తి కర్రను పట్టుకొని చుట్టూర తిప్పితే చాలు చెరుకురసం వచ్చే విధంగా బండ్లను తయ్యారు చేశారు.

ఈచెరుకు బండ్లను మహారాష్ట్రలోని షిర్డీ, శనిసింగనాపూర్‌ ప్రాంతాల నుంచి రూ. 40 వేలకు కొనుగోలు చేస్తున్నారు. ఎండలు ముదిరిన సమయంలో చెరుకు రసాలకు గిరాకి ఎక్కువగా ఉంటుందని రహదారుల ఇరువైపులా స్థలాలను చూసుకొని బండ్లను ఏర్పాటు చేసుకుంటారు. పగలంతా చెరుకురసాలు తీసి విక్రయించడం, రాత్రి సమయంలో ఆబండిని అక్కడే గొలుసులతో కట్టి తాళం వేసి వెళతారు. చెరుకు గోదాం నుంచి చెరుకుగడలను తీసుకొచ్చి చెరుకురసాలను విక్రయిస్తారు. ఇరవై రూపాయలకు ఒక గ్లాసు చెరుకు రసంను విక్రయిస్తున్నారు. పెళ్లిలు, శుభకార్యాలు ఎక్కవగా ఉన్న రోజు వెయ్యి రూపాయలు , మామూలు రోజుల్లో రూ. 400 నుంచి రూ. 500ల వరకు సంపాదిస్తున్నామని చెరుకు రసం తయ్యారు చేసే వారు తెలిపారు . ఈ చెరుకురసం వ్యాపారంలో ఇద్దరికి మూడు నెలల పాటు ఉపాధి లభిస్తుందన్నారు. ఈబండ్లను పూర్తిగా చెక్కతో తయ్యారు చేయడంతో ఆరోగ్యానికి మంచిదని చెరుకురసం తాగేవారు అంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement