ప్రభ న్యూస్ బ్యూరో, ఉమ్మడి మెదక్ : పెట్రోల్ బంకులలో స్వచ్ఛమైన తాగునీరు.. సామాన్య ప్రజల సౌలభ్యం కోసం పెట్రోల్ బంకుల వద్ద ఉచితంగా తాగునీటి సదుపాయాన్ని కల్పించాలి. ఇందుకోసం పెట్రోల్ పంప్ డీలర్ ఆర్‌ఓ మెషిన్, వాటర్ కూలర్, వాటర్ కనెక్షన్‌ను ఏర్పాటు చేయాలి. ఏ పంపు లోనైనా తాగునీటి సౌకర్యాలు అందుబాటులో లేకపోతే, మీరు చమురు మార్కెటింగ్ సంస్థకు ఫిర్యాదు చేయవచ్చు.
అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ కాల్స్..
మీరు వెళ్లే మార్గంలో ఏదైనా సమస్యలో చిక్కుకుంటే మీ వద్ద మొబైల్ ఫోన్ సౌకర్యం లేకపోతే భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా పెట్రోల్ పంపును సందర్శించడం ద్వారా మీరు ఏ నంబర్‌కు అయినా కాల్స్ చేయవచ్చు. ఇందుకు పెట్రోల్ పంప్ వద్ద ఉన్న ఉద్యోగి లేదా మేనేజర్ ఎవరైనా మిమ్మల్ని తిరస్కరించలేరు. ఈ సౌకర్యం పెట్రోల్ పంపులలో కూడా ఉచితంగా లభిస్తుంది.
వాష్ రూమ్స్..
పెట్రోల్ పంపుల వద్ద ప్రజలకు శుభ్రమైన బాత్ రూమ్స్ సౌకర్యాలు కల్పించాలి. దీన్ని ఉపయోగించడాన్ని ఎవరూ ఆపలేరు. పెట్రోల్ పంప్ వద్ద మురికి నీరు, సరైన బాత్ రూమ్స్ లేకుంటే మీరు చమురు కంపెనీకి ఫిర్యాదు చేయవచ్చు. అంతే కాక స్త్రీలకు, పురుషులకు విడివిడిగా వాష్ రూమ్ సౌకర్యం కలిపించాలి.
ప్రథమ చికిత్స కిట్ సౌకర్యం ఉండాలి…
ప్రతి పెట్రోల్ పంపు వద్ద ప్రథమ చికిత్స కిట్ సౌకర్యం ఉండాలి, తద్వారా సాధారణ ప్రజలు అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించుకోవచ్చు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లో ఆరోగ్యాన్ని రక్షించే మందులు ఉండాలి. దీనితో పాటు- అన్ని మందులపై ఎక్వైరీ తేదీ కూడా రాయాలి. ఈ పెట్టెలోని మందులు పాతవి కాకూడదు. మీ డిమాండ్‌పై పెట్రోల్ పంప్ యజమాన్యం ప్రథమ చికిత్స కిట్ ఇవ్వడానికి నిరాకరిస్తే, మీరు దాని గురించి రాతపూర్వక ఫిర్యాదు చేయవచ్చు.
చమురు నాణ్యత, పరిమాణాన్ని తెలుసుకునే హక్కు…
సౌకర్యాలతో పాటు- వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ నాణ్యత, పరిమాణాన్ని తెలుసుకునే హక్కు కూడా మీకు ఉంది. పెట్రోల్ పంప్ యజమానులు దీనికి ఏర్పాట్లు- చేయాలి. అలా చేయకపోతే మీరు ఫిర్యాదు చేయవచ్చు.
నోటిస్ బోర్డు ఏర్పాటు చేయాలి..
పెట్రోలియం సంస్థ పేరు, సంప్రదింపు నంబర్‌ను వ్రాసి పెట్రోల్ పంప్ యజమాని దానిని ప్రజలకు కనిపించేలా నోటీ-స్ బోర్డు ఏర్పాటు- చేయాలి. దీని ద్వారా వినియోగ దారులకు పెట్రోల్ పంప్ యజమాని లేదా సంబంధిత సంస్థను సంప్రదించేందుకు అవకాశం లభిస్తుంది. ప్రతి పెట్రోల్ పంపు వద్ద బంక్ ప్రారంభ సమయం, క్లోజ్ చేసే సమయం నోటీ-సు ద్వారా తెలపడం అవసరం. దీనితో పాటు- పెట్రోల్ పంప్ ఏ రోజు మూసివేయబడుతుందనే సమాచారం కూడా ఇవ్వడం తప్పనిసరి.
బిల్ ఇవ్వడానికి నిరాకరిస్తే..
పెట్రోల్, డీజిల్ బిల్లు కొన్ని కారణాల వల్ల పెట్రోల్ పంప్ యజమాని లేదా ఏజెంట్ మీకు బిల్లు ఇవ్వడానికి నిరాకరిస్తే, మీరు దాని గురించి కూడా ఫిర్యాదు చేయవచ్చు.
గాలి నింపే సౌకర్యం ఉచితంగానే..
టైర్లలో గాలి నింపడానికి అన్ని పెట్రోల్ పంపుల వద్ద ఎయిర్ మెషీన్ తప్పనిసరి. ఇందుకోసం పెట్రోల్ పంప్ డీలర్ వాహనాల్లో గాలిని నింపడానికి ఎలక్ట్రానిక్ యంత్రాన్ని, గాలిని నింపడానికి ఒక వ్యక్తిని నియమిం చాల్సిన అవసరం ఉంది. పెట్రోల్ పంప్ యజమాని లేదా సిబ్బంది ఈ సర్వీస్ కోసం నియమించిన వ్యక్తి మిమ్మల్ని డబ్బు అడగటానికి వీల్లేదు. ఈ సదుపాయం ఉచితంగా ప్రజలకు అందించాలి. ఒకవేళ డబ్బు అడిగితే దానిపై సంబంధిత చమురు కంపెనీకి ఫిర్యాదు చేయవచ్చు. సర్వీస్ బుక్ కచ్చితంగా ఉండాలి. ప్రతి పెట్రోల్ పంపులో ఫిర్యాదు బాక్స్ లేదా రిజిస్టర్ ఉంచాలి, ఇందులో వి నియోగదారులు తమ ఫిర్యాదును నమోదు చేయవచ్చు. పెట్రోల్ పంప్ వద్ద పైన పేర్కొన్న సదుపా యాలు ఏవీ మీకు అందించకపోతే లేదా కల్పించకపోతే మీరు సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ పోర్టల్ ఠషషూ: ూగూుసషశ. గుు. nను సందర్శిం చడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. లేదా పెట్రోల్ బంక్‌లో ఉన్న సర్వీస్ బుక్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..