Tuesday, November 26, 2024

ఈ ఘ‌ట‌న‌లు దిగ్భ్రాంతికి గురి చేశాయి-మ‌హిళ‌లు సుర‌క్షితంగా ఉంటేనే భార‌త్ లో అభివృద్ధి-రాహుల్ గాంధీ

ఓ రిసెప్ష‌నిస్టు హ‌త్య‌కి గుర‌యిన ఉద‌తంపై స్పందించారు కాంగ్రెస్ కీల‌క నేత రాహుల్ గాంధీ. అంతేకాదు యూపీలోని మొరాదాబాద్ లో అత్యాచారానికి గురైన యువతి నగ్నంగా నడుచుకుంటూ వెళ్లిన ఘటనలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహిళలు సురక్షితంగా ఉన్నప్పుడే భారత్ అభివృద్ధి పథంలో పయనిస్తుందని స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్, మొరదాబాద్ లో అమ్మాయిల పట్ల జరిగిన ఈ ఘటనలు ప్రతి ఒక్కరినీ నివ్వెరపరిచాయన్నారు. భారత్ జోడో యాత్రలో తాను ఎంతోమంతి ప్రతిభావంతులైన బాలికలను, యువతులను కలుస్తున్నానని, వారి ఆలోచనలను వింటున్నానని తెలిపారు. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం…. వారు భద్రంగా ఉన్నప్పుడే దేశం ముందంజ వేస్తుంది అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర ఒక రోజు విరామం తర్వాత కేరళలో శనివారం తిరిగి ప్రారంభమైంది. 16 రోజుల పాటు నిర్విరామంగా యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ శుక్రవారం విశ్రాంతి తీసుకున్నారు. 17వ రోజు యాత్రను ఈ ఉదయం 6.30 గంటలకే ప్రారంభించారు. ఆయనతో పాటు వందలాది మంది పార్టీ కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు. అలాగే నేటి భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ కూడా పాల్గొన్నారు.
త్రిసూర్‌లోని పెరంబ్రా జంక్షన్ వద్ద మొదలైన ర్యాలీలో రాహుల్ ఉదయం 12 కిలోమీటర్ల మేర నడిచారు. అల్పాహారం కోసం అంబల్లూరు జంక్షన్‌లో ఆగారు. సాయంత్రం 5 గంటలకు తాలూర్ బైపాస్ జంక్షన్ వద్ద యాత్ర తిరిగి ప్రారంభమై, రాత్రి 7 గంటల వరకు సాగుతుందని కాంగ్రెస్ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement