Monday, November 25, 2024

National : ఈ కుక్కలు వెరీ డేంజర్‌…23 రకాల జాతుల కుక్కలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం…

సాధార‌ణంగా పెంపుడు జంతువులను పెంచుకునేందుకు మక్ముకు చూపుతాం. ముఖ్యంగా కుక్కలను ప్రాణప్రదంగా పెంచుకుంటారు. ఇటీవ‌ల చిన్నారుల‌పై కుక్క‌లు దాడి చేసి చంపేసిన ఘ‌ట‌న‌లు తెలిసిందే. పెంపుడు కుక్కల దాడుల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతుండటంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పిట్‌బుల్‌ టెర్రియర్‌, అమెరికన్‌ బుల్‌డాగ్‌, రాట్‌వీలర్‌, మస్టిఫ్స్‌ వంటి 23 జాతుల కుక్కల సంతానోత్పత్తి, అమ్మకాలను నిషేధించాలని అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను ఆదేశించింది.

- Advertisement -

ఈ మేరకు అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్‌ సెక్రటరీలకు మార్చి 12న కేంద్ర పశుసంవర్ధకశాఖ ఆదేశాలు జారీచేసింది. జాబితాలోని 23 జాతుల కుక్కల అమ్మకాలను, వృద్ధి(బ్రీడింగ్‌)ని నిలిపివేయాలని, ఇప్పటికే పెంచుకున్న వాటిని స్టెరిలైజ్‌(సంతానం కలగకుండా) చేయాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇళ్లల్లో పెంచుకుంటున్న కొన్ని ఫెరోషియెస్‌ బ్రీడ్లకు చెందిన కుక్కలు కరవడం వల్ల మనుషులు మృత్యువాత పడుతున్నట్లుగా సిటిజన్‌ ఫోరమ్‌ల నుంచి జంతు సంక్షేమ సంస్థ(ఏడబ్ల్యూవో)ల నుంచి ఫిర్యాదులు రావడంతో పశుసంవర్ధకశాఖ కమిషనర్‌ నేతృత్వంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ వాటిపై విచారణ జరిపింది. విచారణలో మిక్స్‌డ్‌, క్రాస్‌ బ్రీడింగ్‌ చేసినవి సహా 23 బ్రీడ్స్‌ అత్యంత ప్రమాదకరమైనవిగా కమిటీ గుర్తించింది. కాబట్టి వాటి దిగుమతిని, విక్రయాన్ని, బ్రీడింగ్‌ను నిషేందిచాలని సూచించింది. దాంతో సదరు కుక్కలకు సంబంధించి లైసెన్సులు జారీ చేయకూడదని కేంద్రం ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement