Thursday, September 19, 2024

TTD | డిసెంబర్ నెల ఆర్జితసేవ టిక్కెట్ల విడుదల తేదీలు ఇవే !

తిరుమల శ్రీవారి భక్తులకు టిటిడి తీపికబురు చెపింది. డిసెంబరు నెల శ్రీ‌వారి దర్శనం టోకేన్స్ విడుదల తేదీలను తాజాగా ప్రకటించింది. సెప్టెంబరు 18న డిసెంబరు నెల శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల ఆన్‌లైన్‌లో కోటా విడుదల చేయ‌నుంది.

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల డిసెంబర్ నెల కోటాను సెప్టెంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో టిటిడి విడుదల చేయనుంది. ఈ సేవా టిక్కెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 20వ తేదీ.. ఉదయం 10 గంట‌ల‌వరకు చేయవచ్చు. ఈ టిక్కెట్లు పొందిన వారు సెప్టెంబర్ 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నాం 12 గంటలలోపు చెల్లిస్తే లక్కీడిప్‌లో టిక్కెట్లు కేటాయిస్తారు.

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను సెప్టెంబరు 21వ తేదీ ఉద‌యం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. సెప్టెంబరు 21న వర్చువల్ సేవల కోటా విడుదల చేయ‌నున్నారు.

డిసెంబర్‌ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను సెప్టెంబర్‌ 23న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన డిసెంబరు నెల ఆన్ లైన్ కోటాను సెప్టెంబరు 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా నవంబరు నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను సెప్టెంబరు 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. డిసెంబరు నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను సెప్టెంబరు 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

- Advertisement -

తిరుమల, తిరుపతిల‌లో డిసెంబరు నెల గదుల కోటాను సెప్టెంబరు 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. సెప్టెంబరు 27న తిరుమ‌ల – తిరుప‌తి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టిక్కెట్లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా బుక్ చేసుకోవాలని…. ఇతర వెబ్‌సైట్లను చూసి మోసపోవద్దని అధికారులు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement