ఈ ఏడాది డిసెంబర్ వరకు భారతీయులు ఎక్కువగా సెర్చ్ చేసినవాటిని సెర్చింజన్ గూగుల్ బుధవారం ప్రకటించింది. వీటిలో ఎంటర్‌టైన్‌మెంట్, వార్తలు, క్రీడలకు సంబంధించి ఎక్కువగా సెర్చ్ చేశారు. భారతీయులు అత్యధికంగా సెర్చ్ చేసినవాటిలో క్రికెట్, కరోనా, కొవిడ్ వ్యాక్సిన్, కొవిడ్ టెస్టుతోపాటు ప్రధానం పాన్-ఆధార్ లింక్ కూడా ఉంది. కరోనా నేపథ్యంలో కొద్దినెలల క్రితం ఇంటినుంచి బయటకు వెళ్లేందుకు ఆందోళన చెందిన భారతీయులు తమకు అవసరమైన ఉత్పత్తులు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేందుకు సెర్చ్ చేశారు. ఆన్‌లైన్ ద్వారా తమ పనులు పూర్తిచేసుకునేందుకు మొగ్గు చూపారు. గూగుల్ తెలిపిన ప్రకారం పాన్-ఆధార్ అనుసంధానం ఎలా చేయాలనేది ఎక్కువగా వెతికారు. 2021లో గూగుల్ టాప్ లిస్ట్‌లో నిలిచింది.
టాప్-10 కేటగిరీలు..
- ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్),
- కొవిన్.
- ఐసీసీ టీ20 వరల్డ్‌కప్.
- యూరోకప్.
- టోక్యో ఒలింపిక్స్.
- కొవిడ్ వ్యాక్సిన్.
- ఫ్రీ పైర్ రిడీమ్ కోడ్.
- కోపా అమెరికా.
- నీరజ్‌చోప్రా.
- ఆర్యన్‌ఖాన్.