Saturday, November 23, 2024

రాష్ట్రావతరణ వేడుకల్లో పాల్గొనే మంత్రులు, ప్రముఖులు వీరే.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం జూన్‌ 2న సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌లో మంత్రులు, ప్రముఖులు ఆయా జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండాను ఎగురవేస్తారు. జిల్లాల్లో నిర్వహించే రాష్ట్రావతరణ దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనే మంత్రులు, ప్రముఖుల పేర్లతో కూడిన జాబితాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ శుక్రవారం ప్రకటిస్తూ దీనికి సంబంధించిన ఉత్తర్వులను వెలువరించారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్‌, భద్రాద్రి-కొత్తగూడెంలో విప్‌ రేగ కాంతారావు, జగిత్యాలలో ఎస్సీ, మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, జనగామలో ప్రభుత్వ సలహాదారు జీఆర్‌ రెడ్డి, జోగులాంబ గద్వాలలో మాజీ డీజీపీ, ప్రభుత్వ సలహాదారు అనురాగ్‌ శర్మ, కామారెడ్డిలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఖమ్మంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, కరీంనగర్‌లో పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొంటారు.

ఇక‌.. కొమురంభీమ్‌ అసిఫాబాద్‌లో ప్రభుత్వ విప్‌, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మహబూబ్‌నగర్‌లో పర్యాటక, ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌, మహబూబాబాద్‌లో మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, మంచిర్యాలలో ప్రభుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌, మెదక్‌లో పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మేడ్చల్‌లో కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ములుగులో శాసనమండలి ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్సీ ఎంఎస్‌ ప్రభాకర్‌రావు, నాగర్‌కర్నూల్‌లో ప్రభుత్వ విప్‌, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, నల్గొండలో శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, నారాయణపేటలో ప్రభుత్వ సలహాదారు, విశ్రాంత ఐఏఎస్‌ కేవీ రమణాచారి, నిర్మల్‌లో అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, నిజామాబాద్‌లో రోడ్డు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, పెద్దపల్లిలో ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్ పాల్గొంటారు.

రాజన్న సిరిసిల్లలో ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీ రామారావు, రంగారెడ్డిలో విద్యాశాఖ మంత్రి పట్టోళ్ల సబితా ఇంద్రారెడ్డి, సంగారెడ్డిలో హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ, సిద్దిపేటలో ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు, సూర్యాపేటలో విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, వికారాబాద్‌లో ఉప సభాపతి టి.పద్మారావు, వనపర్తిలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, హన్మకొండలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వరంగల్‌లో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌, యాదాద్రి-భువనగిరి జిల్లాలో ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్రావతరణ దినోత్సవాల్లో పాల్గొంటారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement