తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ భారత్ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందింది. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. బీఆర్ఎస్ జెండా కూడా గులాబీ రంగులోనే ఉంది. జెండాలో తెలంగాణ పటం స్థానంలో భారతదేశ చిత్రపటాన్ని ఉంచారు. జై తెలంగాణకు బదులుగా.. జై భారత్ అని పేర్కొన్నారు. జెండాలో కారు గుర్తు కనిపించలేదు. చిన్నచిన్న మార్పులతో బీఆర్ఎస్ జెండాను పాత జెండా(టీఆర్ఎస్)ను పోలే విధంగానే రూపొందించారు. తెలంగాణ ప్రజలు పాత జెండాను చూసినట్లే ఉండాలని.. టీఆర్ఎస్ అధిష్టానం బీఆర్ఎస్ జెండాను తయారు చేయించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ప్రభావం దేశ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో వేచి చూడాల్సిందే..