ప్రతిపక్ష పార్టీల తదుపరి సమావేశం మహారాష్ట్రలోని ముంబైలో జరుగుతుందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మంగళవారం ప్రకటించారు. తేదీని ఇంకా నిర్ణయించలేదని, అయితే తదుపరి పార్టీలు ముంబైలో సమావేశమవుతాయని చెప్పారు.
బీహార్‌లోని పాట్నాలో 16 ప్రతిపక్ష పార్టీలు సమావేశమైన మొదటి సమావేశం తర్వాత, ఈ రోజు బెంగళూరులో 26 పార్టీలు రెండో సారి కలుసుకున్నాయి.
ప్రతిపక్షాల సమావేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రభావం చూపిందని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే చెప్పారు. ప్రతిపక్షాల సమావేశం తర్వాత ఇప్పుడు మోదీ 38 పార్టీలతో ఎన్డీయే సమావేశం నిర్వహించారని విమర్శించారు. ప్రతి ప్రతిపక్ష పార్టీలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఖర్గే ‘ప్రతిపక్షాల ఐక్యత సాధించిన మొదటి విజయం అందరూ ఒకే పేరును అంగీకరించడం’ చాలా గొప్పనిర్ణయం అన్నారు.
- Advertisement -