సియోల్.. దక్షిణ కొరియా రాజధాని. అక్కడ ఏటా హాలోవిన్ ఉత్సవాలు చేస్తుంటారు. సెయింట్స్, ఇతర మతాధిపతులను సంస్మరించుకునేందుకు జరిగే ఉత్సవం అది. ఈ ఏడాది ఆ ఉత్సవానికి వేలాది మందిహాజరు కావడంతో తొక్కిసలాట జరిగి 150 మందిపైగా మరణించారు. పవిత్రమైన ఉత్సవం సందర్భంగా ఈ దుర్ఘటన చోటు చేసుకోవడంచాలా మందిని కలిచివేసింది. సియోల్‌లో ఉత్తర కొరియా నుంచి క్షిపణి దాడులు హోరెత్తిస్తున్న సమయంలోనే ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. దీంతో మీడియాలో ఇందుకు సంబంధించి సరైన సమాచారం ప్రచారం కాలేదు. సియోల్ సమీపంలో చిన్న పట్టణంలాంటి శివారు ప్రాంతంలో ఈ ఉత్సవ వేడుకలు జరిగాయి, ఆ శివారు ప్రాంతంలో వీధులన్నీ ఇరుకైనవి,అక్కడే రెస్టారెంట్లు, బార్లు ఉన్నాయి. అవన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. జనాన్నిఅదుపు చేసేందుకు పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని ఉత్సవ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ఏటా ఈ ఉత్సవాలకు అధిక సంఖ్యలో జనం రావడం మామూలేననీ, కిందటి సంవత్సరం కూడాఇదే మాదిరిగా భారీ సంఖ్యలో వచ్చారని వారు చెబుతున్నారు. శివారు ప్రాంతానికి ఇటావన్ మెట్రో స్టేషన్ ఉంది. ఆ స్టేషన్‌లో కూడా జనం కిక్కిరిసి ఉన్నారు. ఆ గుంపులో న్యూహిల్ అహ్మద్ అనే యువకుడు ఉన్నాడు. అతడు భారతీయుడు. ఐటి ఉద్యోగం చేస్తున్నాడు. ఈ దుర్ఘటనగత శనివారం నాడు జరిగింది.సాయంత్రం ఐదు గంటల నుంచి వచ్చే జనం సంఖ్య పెరిగిందనీ, వారిని అదుపు చేసేందుకు పోలీసులు తగిన ఏర్పాట్లు చేయలేదని అతడు అన్నాడు. ఈ జనం గుంపులుగా రావడం ఒక ఎత్తయితే, ఈ ప్రాంతంలో తొక్కిసలాట జరుగుతోందంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలు జనాన్ని ఆందోళనకు గురి చేశాయని అహ్మద్ చెప్పాడు.
ఆ ప్రాంతంలో పెద్ద శబ్దాలు వినిపించేసరికి ఉత్తర కొరియా బాంబులు వేసిందేమోనన్న భయంతోజనం పరుగులు తీశారు. తొక్కిసలాటకు కారణంఇదే. సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వానికి నియంత్రణ లేదు. దాంతో సోషల్ మీడియాలో పలు రకాల కథనాలు వెలువడ్డాయి. ప్రజల్లో ఆందోళనలు పెరగడానికిఅది కూడాఒక కారణం. నిజానికి హాలోవిన్ ఉత్సవాలను చూసేందుకు మాత్రమే జనం రాలేదు. మన దేశంలో మాదిరిగానేఇలాంటి ఉత్సవాల పేరుచెప్పి సమూహాలు ఒక ప్రాంతంలో చేరుకోవడం, ఒకరినొకరు పరిచయం చేసుకోవడం మామూలే. మొదట్లో ఇది చాలా తక్కువ స్థాయిలో ఉండేది. జనంపెరగడంతో వ్యాపారాలు పెరిగాయి. బార్‌లు, రెస్టారెట్లు వెలిశాయి. మృతుల్లో ఎక్కువ మంది యువతీయువకులే. ఇరవై ఏళ్ళ వయసు వారే. మృతుల్లో కొరియా నటుడు లీ జిహాన్ కూడా ఉన్నాడు. అతడి వయసు 24 సంవత్సరాలు. అలాగే, ఈ దుర్ఘటనలో మరణించిన వారిలో ఇద్దరు అమెరికన్లు, ఆస్ట్రేలియన్లుఇద్దరుఉన్నారు. వీరంతా వారాంతపు సెలవులలో ఈ ఉత్సవాలను తిలకించేందుకు సియోల్ చేరుకున్నారు. సియోల్ ప్రభుత్వం విదేశాల నుంచి వచ్చినవారికి తగిన భద్రతాఏర్పాట్లను చేయలేదని పర్యాటకులు ఆరోపించారు. ఇందుకు సియోల్ ప్రభుత్వం బాధ్యత వహించాలని పర్యాటకులు డిమాండ్ చేస్తున్నారు.