Friday, November 22, 2024

ముందు ఆసియా కప్​ ఉంది.. విరాట్‌కు విశ్రాంతి ఎంతో అవసరం

కోహ్లీ ప్రస్తుత పేలవ ఫామ్‌ చూసి.. భారత్‌ మాజీ కోచ్‌ రవిశాస్త్రితో పాటు చాలా మంది క్రికెట్‌ ప్రముఖులు కోహ్లీ కొన్నాళ్లు రెస్ట్‌ తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం కోహ్లీ ఆట కన్నా.. విశ్రాంతి తీసుకోవడమే మేలు అంటూ తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. తాజాగా భారత్‌ మాజీ క్రికెటర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌ కూడా ఈ వ్యాఖ్యలే చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో.. కోహ్లీకి విశ్రాంతి ఎంతో అవసరం అన్నారు. ముందు ఆసియా కప్‌ ఉందని, అప్పుడు రాణించాలంటే.. ఇప్పుడు విశ్రాంతి ఇవ్వాలని సూచించారు. కోహ్లీతో పాటు విరాట్‌ రోహిత్‌ శర్మకు కూడా రెస్ట్‌ అవసరమని అభిప్రాయపడ్డాడు. రాబోయే టీ20 ప్రపంచ కప్‌లో రోహిత్‌, కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ కీలక ఆటగాళ్లన్నారు. ఓపెనింగ్‌లో శిఖర్‌ ధావన్‌ రావాలని, మంచి ఫామ్‌లో ఉన్నాడని తెలిపాడు. పంజాబ్‌ కింగ్స్‌ జట్టు బ్యాటర్లలో ధానవ్‌ 46.13 సగటుతో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ధావన్‌ ఆడిన 10 మ్యాచుల్లో 369 పరుగులు చేశాడు. ధావన్‌ ఓపెనర్‌గా విఫలం అయితే.. రాహుల్‌ను ఆ ఆర్డర్‌లో పంపించొచ్చు. 4వ స్థానంలో రాహుల్‌ బరిలోకి దిగితే మంచిదని ఎంఎస్‌కే ప్రసాద్‌ అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement