Friday, November 22, 2024

తొక్కిసలాటలో నా తప్పుంటే అరెస్ట్ చేయండి… అజారుద్దీన్

జింఖాన గ్రౌండ్ వద్ద నిన్న జరిగిన టికెట్ల అమ్మకాలపై తన తప్పేమీ లేదని.. తన తప్పుంటే అరెస్ట్ చేయండి అని హెచ్ సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ అన్నారు. ప్రెస్ మీట్ లో అజారుద్దీన్ మాట్లాడుతూ… తమ వైపు నుంచి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. జింఖాన దగ్గర ఏం జరిగిందో పోలీసులకు తెలుసన్నారు. గతంలోనూ ఇలాగే జరిగింది… ఇప్పుడూ అలాగే జరుగుతోందన్నారు. ఆ బాధ్యతంతా పోలీసులు చూసుకోవాలన్నారు. బ్లాక్ లో టికెట్లు అమ్మారనేది అవాస్తవమన్నారు. చాలా రోజుల తర్వాత హైదరాబాద్ లో మ్యాచ్ జరుగుతోందన్నారు. ఈనెల 15న పేటీఎం ద్వారా 11,450 టికెట్లు విక్రయించామన్నారు. కాంప్లిమెంటరీ పాసులు ఏవీ లేవన్నారు. డైరెక్ట్ కార్పొరేట్ టికెట్స్ 6000 ఉన్నాయన్నారు. టికెట్ల అమ్మకం కాంట్రాక్ట్ పేటీఎంకు ఇచ్చామన్నారు. తాను ఏ తప్పు చేశానో చెప్పాలన్నారు. టికెట్ల అమ్మకంలో ఎలాంటి గందరగోళం జరగలేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement