భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్‌ను నిర్వహించాలనే మెల్ బోర్న్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) ఆలోచనకు బీసీసీఐ ఇచ్చిన సమాచారం అడ్డుపడేలా ఉందని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటి వరకు అలాంటి ఉద్దేశం లేదని భవిష్యత్తులో నిర్వహించే ప్రణాళిక లేదని పేర్కొంది. దాదాపు 15 ఏళ్ల నుంచి భారత్- పాక్ కలిసి టెస్టులను ఆడలేదు. ఐసీసీ టోర్నీల్లో వన్డేలు, టీ 20ల్లో మాత్రమే తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ క్రికెట్ బోర్డులు, మైదానాల నిర్వాహకులు భారత్, పాక్ మధ్య టెస్ట్ మ్యాచ్‌లు నిర్వహించాలని ఉత్సుకత చూపిస్తున్నాయి.
అయితే దేశాల స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో ” ప్రస్తుతం లేదా భవిష్యత్తులో ఏ దేశంలోనైనా భారత్ -పాక్ టెస్ట్ సిరీస్ నిర్వహించే ఉద్దేశం. ప్రణాళికలు కానీ లేవు. ఎవరికైనా అలాంటి ఆలోచనలు ఉంటే అవి మీ వద్దే పెట్టుకోండి” అని బీసీసీఐ ఘాటుగానే స్పందించింది.