Monday, November 18, 2024

దేశంలో ఎరువుల కొరత లేదు.. ఖరీఫ్ 2022 సీజన్‌లో తగినంత లభ్యత ఉంది

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశంలో ఎరువుల కొరత లేదని, ప్రస్తుత ఖరీఫ్ 2022 సీజన్‌లో ఎరువుల లభ్యత తగినంతగా ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రైతులకు అందిస్తున్న యూరియా, ఇతర ఎరువుల వివరాలపై నరసరావుపేట ఎంపీ (వైఎస్సార్సీపీ) లావు శ్రీకృష్ణ దేవరాయలు అడిగిన ప్రశ్నకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి బదులిచ్చారు. దేశవ్యాప్తంగా దాదాపు 177 కంపెనీలు రైతులకు సబ్సిడీపై ఎరువులు అందజేస్తున్నాయని వివరించారు. ఎరువుల వినియోగం 2019-20లో 105 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 2020-21లో 126 లక్షల మెట్రిక్ టన్నులకి చేరుకుందని, దాదాపు 20% పెరుగుదల నమోదైందని వెల్లడించారు.

2021-22లో అది 4% స్వల్పంగా తగ్గి 121 లక్షల మెట్రిక్ టన్నులుకి పడిపోయిందని వివరించారు. 45 కిలోల యూరియా  బ్యాగ్‌ రూ. 242లకు అందిస్తున్నామని తెలిపారు. అలాగే యూరియా యూనిట్ల ద్వారా.. వ్యవసాయ ప్రాంతాల వద్ద  డెలివరీ చేసిన యూరియా, నికర మార్కెట్ రియలైజేషన్ మధ్య వ్యత్యాసాన్ని ప్రభుత్వం యూరియా తయారీదారులకి, దిగుమతిదారునికి సబ్సిడీగా అందజేస్తోందని వివరణ ఇచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement