Monday, November 18, 2024

TG | బీర్లకు కొరత లేదు..

  • రోజుకు 2 లక్షల కేసుల విక్రయం
  • 7.57లక్షల పెట్టెలు రెడీ
  • ఎక్సైజ్‌ శాఖ వెల్లడి..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో బీర్ల కొరత వాస్తవమేనని ఆబ్కారీ శాఖ కమిషనర్‌ శ్రీధర్‌ స్పష్టం చేశారు. బీర్ల కొరతపై తరచూ మీడియాలో కథనాలు వస్తుండటంతో ఆయన వివరణ ఇచ్చారు. డిమాండ్‌కు తగినట్లు రాష్ట్రంలో ఉత్పత్తి లేదని వెల్లడించారు. గడిచిన ఐదు నెలల కాలంలో నాలుగు కొత్త బ్రాండ్లకు మాత్రమే అనుమతులు ఇచ్చినట్లు వివరించారు.

తెలంగాణలో బీర్ల కొరత లేదని.. కేవలం కింగ్‌ ఫిషర్‌ బ్రాండ్‌ కొరత తప్ప.. మిగతా అన్ని రకాల బీర్లు అందుబాటులో ఉన్నాయని ఎక్సైజ్‌ శాఖ పేర్కొంది. బీరు తయారు చేసే బ్రూవరీస్‌ కంపెనీలకు మూడో షిప్టు అనుమతించక పోవడంతో కృత్రిమ కొరత ఏర్పడిందని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని పేర్కొంది.

ప్రస్తుతం తెలంగాణలో ఆరు బీరు తయారు చేసే బ్రూవరీస్‌ కంపెనీలు ఉన్నాయని.. ప్రభుత్వ అనుమతి ఉన్న బీరు తయారీ కంపెనీలు లైసెన్స్‌లు షరతుల ప్రకారమే.. ఉత్పత్తి చేయడానికి అనుమతి ఉంటుందని పేర్కొంది. ఈ సందర్భంగా ఎక్సైజ్‌ కమిషనర్‌ శ్రీధర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆరు బ్రూవరీలు ఉన్నాయి.

లైసెన్స్‌ నిబంధనల మేరకే అవి పని చేస్తాయి. వీటికి ఒక షిప్ట్‌ లో ఉత్పత్తి చెయ్యడం కోసం అనుమతి ఉంటుంది. అయితే పెరుగుతున్న డిమాండ్‌ కారణంగా, బ్రూవరీల వినతి మేరకు నిర్దిష్టమైన రుసుము చెల్లింపుతో మూడు షిప్టుల్లో పని చేయడానికి అనుమతిస్తారు.

అయితే 6 బ్రూవరీలలో కేవలం నాలుగు మాత్రమే తమ బ్రాండ్‌లతో 95 శాతం మార్కెట్‌ వాటాను ఆక్రమించాయి అని పేర్కొన్నారు. ఆ నాలుగు బ్రూవరీలు మూడు షిఫ్టులు పని చేయడానికి అనుమతి ఉంది. అయితే ఇవి నాలుగు రోజుకు ఒక్కో షిప్ట్‌nకు 1.66 లక్షల కేసుల లెక్కన మూడు షిప్ట్‌లకు 4.98 లక్షల కేసులు ఉత్పత్తి చేసే సామర్థం ఉంది.

- Advertisement -

ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించి, మూడు షిప్ట్‌ల్లో కేవలం 2.51 లక్షల కేసులను మాత్రమే తయారు చేస్తున్నారు అని తెలిపారు. రాష్ట్రంలో సాధారణంగానే లిక్కర్‌ కంటే బీరు వాడకం ఎక్కువ. ఇందుకు తోడు వేసవిలో బీరు వాడకం మరింత అధికంగా ఉంటుంది. ఎండాకాలం రాగానే అమ్మకాలు జోరందుకుంటాయి. రోజుకు సగటున 2 లక్షల కేసులు అమ్ముడుపోతాయి.

ఇప్పటి వరకు 7.57 లక్షల కేసులు బేవరేజ్‌ కార్పొరేషన్‌ డిపోలు, బ్రూవరీస్‌లో అందుబాటులో ఉన్నాయి. కింగ్‌ఫిషర్‌ బ్రాండ్‌ డిమాండ్‌కు తగ్గట్లు ఉత్పత్తి చెయ్యడం లేదని ఆబ్కారీ శాఖ కమిషనర్‌ శ్రీధర్‌ తెలిపారు. యాజమాన్యం తక్కువ ఉత్పత్తి చేయడం వల్ల బీర్‌కు కృత్రిమ కొరత ఏర్పడిందని వివరించారు. తగినంత నిల్వలు అందుబాటు-లో ఉండేలా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని వివరించారు.

కొత్త బ్రాండ్ల రిజిస్ట్రేషన్‌ కొత్తదేం కాదు…

కొత్త బ్రాండ్‌ల రిజిస్ట్రేషన్‌ ఇప్పుడు కొత్తగా వచ్చిన విధానం కాదని తెలిపారు. ఇది చాలా సంవత్సరాలుగా అనుసరిస్తున్న విధానమేనని స్పష్టం చేశారు. కొత్త సంస్థలు తమ స్టాక్‌ను స్టేట్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు సరఫరా చేయడానికి అనుమతించబడతాయని, గత ఐదేళ్లలో దాదాపు 360 బ్రాండ్‌లకు అనుమతి ఉందని, గడిచిన ఐదు నెలల్లో బీర్‌ సరఫరా కోసం నాలుగు బీర్‌ బ్రాండ్లకు అనుమతించినట్లు తెలిపారు.

నాలుగు కంపెనీల్లో…

డిమాండ్‌ ఉన్న నాలుగు కంపెనీల రోజు వారి ఉత్పత్తి సామర్ధ్యం 1,66,000 కేసులు. ఇలా మూడు షిప్టుల్లో 4,98,000 కేసులు తయారు చేయాల్సి ఉంటుంది. కానీ మూడు షిప్టులు నడుపుకోవడానికి అనుమతి తీసుకున్న కంపెనీలు మూడు షిప్టుల్లో కేవలం 2.51 లక్షల కేసుల బీరును మాత్రమే ఉత్పత్తి చేశాయి.

తెలంగాణలో వేసవిలో బీరు సరాసరి రోజుకు 2.00 లక్షల కేసులు అమ్మకాలు జరుగుతాయి. ఇప్పటి వరకు 7.57 లక్షల కేసుల బీరు కేసులు బ్రెవరీస్‌ కార్పొరేషన్‌ డిపోల్లో, బ్రూవరీస్‌ల్లో నిల్వలు ఉన్నాయి. మొత్తంగా మార్కెట్‌లో బీరు కొరత లేదు. కింగ్‌ ఫిషర్‌ బ్రాండ్‌ కొరత తప్ప మిగిలిన అన్ని రకాలు బీర్లు అందుబాటులో ఉన్నాయి.

బీరు తయారు చేసే కంపెనీలు మూడు షిప్టుల అనుమతి తీసుకున్నా కూడా తగిన బీరు ఉత్పత్తి చేయలేకపోవడం వల్ల కింగ్‌ ఫిషర్‌ బీరు కొరత ఏర్పడింది. అయినప్పటికి ఎక్సైజ్‌ శాఖ యంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకొని బీరు నిల్వలకు కొరత లేకుండా చూశారు.

అదనపు అనుమతులు…

ప్రస్తుతం తెలంగాణలో ఆరు బీరు తయారు చేసే బ్రూవరీస్‌ కంపెనీలు ఉన్నాయి. ప్రభుత్వ అనుమతి ఉన్న బీరు తయారీ కంపెనీలు లైసన్స్‌ షరతుల ప్రకారమే ఉత్పత్తి చేయడానికి అనుమతి ఉంటు-ంది. సాదారణంగా ఒక షిప్టుకు అనుమతి ఉంటుంది.

కానీ బీరు డిమండ్‌ మేరకు బ్రూవరీస్‌ అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని అవసరమైన రుసుం చెల్లించిన వారికి మూడు షిప్టులకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఆరు బ్రూవరీస్‌లో, నాలుగు బ్రూవరీస్‌ 95 శాతం వారి డిమాండ్‌ కలిగిన బ్రాండ్స్‌ ఉత్ప్సత్తి చేస్తాయి. బీరు ఉత్పత్తి కంపెనీలు చేసే నాలుగు కంపెనీలకు మూడు షిప్టులకు అనుమతి తీసుకున్నారుఅని ఎక్సైజ్‌ శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement