శ్రీలంకతో టీ20 సిరీస్‌లో ప్రయోగాలకు చోటు లేదని, ఓపెనర్‌గా తానే బరిలోకి దిగుతానని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. బుధవారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. విండీస్‌తో మూడో టీ20 మ్యాచ్‌లో చేసిన ప్రయోగం ఆ మ్యాచ్ వరకే అని, ఇక నుంచి తానే రెగ్యులర్ ఓపెనర్ అని తెలిపాడు. టీ20 ప్రపంచ కప్‌నకు ఎక్కువ దూరం లేదని, అందుకే ప్రయోగాలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు తెలిపాడు. మూడు ఫార్మాట్స్‌లో కెప్టెన్సీ చేసే అవకాశం దొరకడం గొప్ప అవకాశమన్నాడు. ఈ అవకాశం రావడం గురించి తెలిసినప్పుడు సంతోషించినట్టు తెలిపాడు. పూర్తి స్థాయి కెప్టెన్సీ అనేది మంచి అనుభూతి ఇస్తుందని చెప్పాడు.
ఈ ప్రయాణంలో అనేక సవాళ్లు ఉన్నప్పటికీ.. తమ దగ్గర అత్యుత్తమ ఆటగాళ్లు ఉన్నారని, రాబోయే మ్యాచ్‌ల కోసం ఎదురు చూస్తున్నామని తెలిపాడు. పని భారం తనకే కాదు.. అందరికీ కీలకం అన్నాడు. ఆ విషయమై తనకు ఎలాంటి ఆందోళన లేదన్నాడు. అన్ని మ్యాచులు ఆడేందుకు సిద్ధంగా ఉన్నా అని, ప్రతీ రోజు ఫ్రెష్‌గా ఆలోచిస్తే భారం అనిపిందని తెలిపాడు. అవకాశం వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకుంటామని, ఇక జట్టును నడిపించడంపై పూర్తి క్లారిటీతో ఉన్నట్టు వివరించాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..