Monday, November 25, 2024

CAAను అమలు చేసే ప్రసక్తేలేదు.. : కేరళ సీఎం

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ ని అమలు చేసింది. అయితే పార్లమెంటు ఎన్నికలకు ముందు వివాదాస్పద ‘పౌరసత్వ సవరణ చట్టం-2019’ని అమలు చేయడం చర్చనీయాంశంగా మారింది. సీఏఏను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా వ్యతిరేకించారు. దీన్ని మత విభజన చట్టంగా అభివర్ణించిన పినరయి విజయన్.. తమ రాష్ట్రంలో దీన్ని అమలు చేయబోమని తేల్చిచెప్పారు. మరోవైపు, ఈ దేశంలో CAA అమలును మేము స్వాగతిస్తున్నాము, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభినందిస్తున్నామని అయోధ్య రామ మందిర ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ అన్నారు.

ఈ చట్టం 2014 డిసెంబరు 31 కంటే ముందు ఆఫ్ఘనిస్తాన్ ,పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి. ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. ఈ చట్టంలో ముస్లింలను మినహాయించడంపై వివాదం రాజకుంది. 1955 నాటి పౌరసత్వ చట్టానికి ఎన్డీఏ ప్రభుత్వం సవరణలు చేసి 2019లో చట్టంగా మార్చింది. అయితే పౌరసత్వం ఇచ్చేందుకు మతాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం దేశంలో ఇదే మొదటిసారి.
.

Advertisement

తాజా వార్తలు

Advertisement