Tuesday, November 19, 2024

TS | దేశంలో రిజర్వేషన్ మార్చే ప్రసక్తి లేదు : అమిత్ షా

తెలంగాణలో ప్రతి ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంక్ పెంచుకుంటోందని, ఈ లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ 10 కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని కాబోతున్నారని, వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమేనని అమిత్ షా జోస్యం చెప్పారు. ఆదిలాబాద్​లోని కొమురంభీం జిల్లా కాగజ్​నగర్ లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన అమిత్ షా ప్రసంగించారు.

రిజర్వేషన్లపై నా వీడియోను సీఎం రేవంత్ రెడ్డి మార్ఫింగ్ చేశారని ఆరోపించారు. దేశంలో రిజర్వేషన్ మార్చే ప్రసక్తి లేదని, ఇది మోడీ గ్యారంటీ అంటూ భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఓవైసీకి భయపడుతాయి.. రాష్ట్ర అభివృద్ధి కేవలం బీజేపీ వల్లే సాధ్యమని సంచలన వ్యాఖ్యలు చేశారు.

పదేండ్లు బీఆర్ఎస్ అవినీతి జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ అవినీతి చేస్తోంది. కాంగ్రెస్ తెలంగాణను ఏటీఎంగా మార్చుకుంది. అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టును పూర్తి చేయలేదు. నిరుద్యోగం పెరిగిపోయింది. గతంలో పేపర్ ఫ్యాక్టరీ ఉండేది, అది కూడా మూతపడిందని అమిత్ షా అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి గిరిజనులు, ఆదివాసీ, దళితుల అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు.

కాంగ్రెస్ పార్టీ దేశంలో 12 లక్షల‌ కోట్లు లూటీ చేసిందని ఆరోపించారు. పదేళ్ల ప్రధానిగా చేసినా నరేంద్ర మోదీపై అవినీతి మచ్చ కూడా లేదు అని అన్నారు. ఇవాళ మోదీ హయాంలో కాశ్మీర్‌లో జాతీయపతాకం రెపరెపలాడుతుందోని, సోనియా, మన్మోహన్‌ల పదేళ్ల ప్రభుత్వం అల్లర్లు గొడవలతోనే నడిచిందని దుయ్యబట్టారు. అదే మోదీ ప్రభుత్వం తీవ్రవాదులు, మావోయిస్టుల భరతం పట్డిందన్నారు. దయాది దేశమైన పాకిస్తాన్‌కు మోదీ చుక్కలు చూపించారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement