Friday, November 22, 2024

Entrance: నీట్‌, జేఈఈ విలీన ప్రతిపాదనల్లేవు.. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

కేంద్ర ప్రభుత్వం ప్లస్‌ టూ విద్యార్థులకు నిర్వహిస్తున్న మెడికల్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌నీట్‌, ఇంజనీరింగ్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ జేఈఈ పరీక్షలను కామన్‌ యూనివర్శిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (సీయుఈటీ)లో విలీనం చేసే ప్రతిపాదనలు లేవని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ స్పష్టం చేశారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతో కలిసి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ బుధవారం రాజస్థాన్‌లోని కోట నగరంలో ఉన్న కోచింగ్‌ సెంటర్‌ విద్యార్థులతో ముచ్చటించారు. నీటీ, జేఈఈలను సీయుఈటీలో విలీనం చేసే ప్రతిపాదనలు లేవని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో నీట్‌, జేఈఈ, సీయుఈటీల మోడల్‌ మాత్రమే అమల్లో ఉందని ఆయన ప్రకటించారు.

జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ)-2020 ఐదు సంవత్సరాల ఫౌండేషన్‌ కోర్సు బాలవాటిక పుస్తకాలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా స్కూళ్లకు సరఫరా చేయడం జరుగుతుందని ప్రకటించారు. అయితే, నీట్‌, జేఈఈలపై కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు యూజీసీ చైర్మన్‌ చేసిన వ్యాఖ్యలకు పూర్తి భిన్నంగా ఉండడం గమనార్హం. భవిష్యత్‌లో నీట్‌, జేఈఈలను సీయుఈటీలో విలీనం చేసే అవకాశం ఉందని యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ చైర్మన్‌ జగదీష్‌ కుమార్‌ ఆగస్ట్‌లో ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement