Monday, October 21, 2024

TG | అలాంటి ఘటనలకు చోటు లేదు.. ఉపముఖ్యమంత్రి భట్టి

షాద్‌నగర్‌లో దళిత మహిళను కొట్టిన ఘటనపై ఉప‌ముఖ్య మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క స్పందించారు. ఇందిరమ్మ రాజ్యం, ప్రజా ప్రభుత్వంలో షాద్ నగర్ లాంటి ఘటనలను మా ప్రభుత్వం సహించద‌ని అన్నారు. ఒక చోరీ కేసులో దళిత మహిళను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి శిక్షించిన అంశంపై సంబంధిత పోలీసు సిబ్బంది, అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నత అధికారులను ఆదేశించిన‌ట్టు వెల్ల‌డించారు.

ఘటనపై షాద్‌నగర్‌ ఏసీపీ రంగస్వామిని విచారణాధికారిగా నియమించి ఒక్కరోజులోనే విచారణ జరిపించారు. మహిళను విచక్షణారహితంగా కొట్టినట్టు నివేదిక సమర్పించడంతో సీఐ సహా ఆరుగురు సిబ్బందిని వెను వెంటనే సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన‌ట్టు తెలిపారు.

బాధిత కుటుంబాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మా ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భట్టి విక్రమార్క అన్నారు. బాధిత కుటుంబాన్ని మా ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటామని, సామాజిక బాధ్యతలో భాగంగా వైద్య సహాయం అందజేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసు శాఖ ఉన్నతాధికారులను హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement