Friday, November 22, 2024

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జీతాలకు గ్రీన్​ సిగ్నల్​.. ఆందోళన అవసరం లేదు

అమరావతి, ఆంధ్రప్రభ: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పెరిగిన వేతనాలు అందుకునే విషయంలో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్​ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగలు సంఘం గౌరవ అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు సోమవారం ఆయనొక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రోబేషన్‌ డిక్లేర్‌ చేసి జులై ఒకటో తేదీ నుంచి కొత్త పీఆర్సీ ప్రకారం పే స్కేల్స్‌ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అయితే కొత్త జీతాలు చెల్లించాలంటే బడ్జెట్లో కేటాయింపులు మరియు హెడ్స్‌ క్రియేట్‌ చేయాలని డైరెక్టర్‌, ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌ వారు ప్రభుత్వానికి లేఖ రాశారని చెప్పారు.

ఈ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆంధ్రప్రదేశ్‌ తరఫున ఆర్థిక శాఖ అధికారులను కోరడం జరిగిందన్నారు వెంకటరామిరెడ్డి. ఆర్థిక శాఖ అధికారులు సెలవు దినమైనప్పటికీ ఆదివారం వచ్చి పీఎఫ్‌ఎంఎస్‌లో జీతాలకు సంబంధించిన అన్ని హెడ్స్‌ను క్రియేట్‌ చేసి పెరిగిన జీతాల కోసం గ్రామ సచివాలయాలకు రూ. 768 కోట్లు, వార్డు సచివాలయాలకు రూ. 221 కోట్లు అదనపు కేటాయింపులు చేయాలని ప్రతిపాదనలు రూపొందించారని వివరించారు.

వెంటనే ఈప్రతిపాదనలు ఆమోదించడంతో ఆర్థిక శాఖ గ్రామ సచివాలయాలకు పెరిగిన జీతాల కోసం రూ. 768 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ జీవో నెంబర్‌ 3541 జారీ చేసినట్టు తెలిపారు సంఘం గౌరవ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి. అలాగే వార్డు సచివాలయాలకు పెరిగిన జీతాల కోసం సంబంధించిన ప్రతిపాదనలు ఆర్థిక శాఖ కార్యదర్శి గురుజార్‌కు పంపారని, ఆయన కూడా ఒకటి లేదా రెండు రోజుల్లో ఆమోదం తెలుపుతామని చెప్పారన్నారు. దీనికి సంబంధించిన జీవో కూడా త్వరలోనే విడుదలతవుతుందని తెలిపారు. అందువల్ల ప్రొబేషన్‌ డిక్లేర్‌ అయిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎవరూ జీతాల గురించి ఆందోళన చెందవద్దని, అందరికీ పే స్కేల్‌ ప్రకారం జీతాలు అందుతాయని వెంకటరామిరెడ్డి తెలిపారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement